ఎక్కువ కోవిడ్ పరీక్షలు చేస్తే చర్యలు: తెలంగాణలో హెచ్చరిక

తెలంగాణలో ఏ ఆసుపత్రి ఎన్నికోవిడ్ పరీక్షలు చేయాలో ప్రభుత్వం కోటా విధించింది. అంతకంటే ఎక్కువ పరీక్షలు చేస్తే చర్యు తీసుకుంటామని ఆసుపత్రులను, హెల్త్ సెంటర్లను అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం లో 50 మించి పరీక్షలు చేయరాదని షరతు పెట్టారు. ఇదే పట్టణ ఆరోగ్యం కేంద్రానికి కూడా అంతే కోటా కేటాయించారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి 100, జిల్లా ఆసుపత్రికి  200 పరీక్షలు కోటా కేటాయించారు. ఇంతకు మంచి కోవిడ్  పరీక్షలు చేస్తే అంతే సంగతులుట.

పరీక్షలు ఎక్కువగా జరపండని కోర్టులు చెబుతూ ఉంటే, తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు వద్దంటున్నది. ఇలా జగిత్యాల జిల్లా ల నుంచి వచ్చిన ఒక   నోటిపికేషన్ ఇది. దీనిని యధాతథంగా ఇస్తున్నాం.

==

కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారి ఆదేశాలతో జిల్లాలోని ప్రతి పట్టణ, ప్రాథమిక మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కొవిడ్ పరీక్షలు మీకు కేటాయించిన లక్ష్యానికి మించి చేయరాదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 50
పట్టణ ఆరోగ్య కేంద్రం. 50
సామాజిక ఆరోగ్య కేంద్రం 100
జిల్లా ఆసుపత్రి. 200

ఈ పరీక్షల్లో ముఖ్యంగా పాజిటివ్ వ్యక్తులకు దగ్గరి వారు మరియు ఏదైనా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలి. ఎవరైనా మీ మీ లక్ష్యానికి మించి పరీక్షలు చేసినట్టయితే తీసుకోబోయే చర్యలకు పూర్తి బాధ్యత మీదే..

కృతజ్ఞతలు

—- జిల్లా వైద్య మరియు
ఆరోగ్య శాఖ అధికారి, జగిత్యాల

One thought on “ఎక్కువ కోవిడ్ పరీక్షలు చేస్తే చర్యలు: తెలంగాణలో హెచ్చరిక

  1. నిజమైన లేఖనే కావొచ్చా? ఫేక్ ఉండొచ్చా? డౌట్ గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *