ఆంధ్రాకు 470 మె. టన్నుల ఆక్సిజన్ కేటాయించిన కేంద్రం

రాష్ట్రం లో ఏర్పడిన ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం  470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్  కేటాయించింది. ఇందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తున్నది. ఇతర  ప్రాంతాలు నుంచి మరో 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం అందిస్తున్నది. మరికొన్ని పరిశ్రమల నుంచి మిగతా ఆక్సిజన్ అందుతుంది. ఒరిస్సాలోని టాటా స్టీల్ ప్లాంట్, ఏఎస్‌డబ్ల్యూ నుంచి అంకురు ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆంధప్రదేశ్ కు తరలిస్తున్నారు.

ఈ ఆక్సిజన్ రాష్ట్రానికి తక్షణం అందుబాటులోకి వచ్చేందుకు  సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్రం  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం కేటాయించింది.

ఈ విషయాలను కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు విలేకరులకు తెలిపారు.

రాష్ట్రంలో 20 వేల మందికి ఆక్సిజన్ అందిస్తున్నారు. 18 మెట్రిక్ టన్నులు, 28 టన్నుల కెపాసిటీ ఉన్న రెండు ట్యాంకర్‌లు ఆక్సిజన్ ను తీసుకురావడానికి పంపిస్తున్నామని, వీటిని తీసుకుని   గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరి వెళ్తున్నదని ఆయన చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *