వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటల రాజేందర్ తొలగింపు

ఈటల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ప్రాసెస్ మొదలయింది.  ఆయన నుంచి  వైద్య ఆరోగ్య శాఖ ను తీసేశారు. ఈ శాఖ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉంటుందని ప్రకటన విడుదలయింది.

ఈ శాఖ బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి చేసిన సూచనను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్ భవన్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇది తక్షణం అమలులోకి వస్తుందని కూడా ప్రకటనలో రాశారు.

ఇపుడు ఈటల శాఖ లేని మంత్రి. ఇక నువ్వు అసవరం లేదు,  రాజీనామా చేయవచ్చనేందుకు ఇది సంకేతం.

ఈటలమీద వచ్చి భూకబ్జా ఆరోపణల మీద ఈ రోజు  అచ్చంపేటలో తుప్రాన్‌ ఆర్డీవో రాంప్రకాశ్‌ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్‌ సర్వే కొనసాగుతోంది.

దీంతో పాటు హేచరీస్‌కు పక్కన ఉన్న అసైన్డ్‌ భూముల్లోనూ అధికారులు డిజిటల్‌ సర్వే చేస్తున్నారు. తుప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో మంత్రి ఈటల ఫామ్‌ హౌస్‌ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.

ఈ నేపథ్యంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖనుంచి తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *