తెలంగాణ రాత్రి కర్ఫ్యూ మే 8 దాకా పొడిగింపు

తెలంగాణ రాష్టంలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూని మే 8 తేదీ ఉదయం అయిదుగంటల దాకా పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 తేదీనుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జివొ విడుదల చేసింది.అపుడు ఇది ఏప్రిల్ 30 దాకా అమలులో ఉంటుందని చెప్పారు. ఈరోజు దాకా పరిస్థితేమీ మెరుగుపడకపోవడంతో కర్ఫ్యూని మే 8 తేదీగా పొడిగించారు.

కర్ఫ్యూ రాత్రి 9గంటలకు మొదలయి,మరుసటి రోజు ఉదయం 5 గంటల దాకా ఉంటున్నది. కర్ఫ్యూను అమలుచేసేందుకు మార్కెట్లు మొత్తంగా ఎనిమిది గంటలకే మూసేయాలని ప్రభుత్వం పేర్కొంది.

 

All offices, firms,  shops, establishments, restaurants etc shall close at 8.00 pm except hospitals, diagnostic labs, pharmacies, and those dealing with supply of essentials, అని జివొ లో  పేర్కొన్నారు.

కర్ఫ్యూ నియమాలను ఉల్లంగిస్తే 2005 ప్రకృతివైపరీత్యా నివారణ చట్టంలోని 51 నుంచి 60 వరకు ఉన్న సెక్షన్లతో పాటు ఐపిసి 188 సెక్షన్ కింది చర్యలు తీసుకుంటారు.

రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్ మెట్రోకు అనుమతి ఉంటుంది.

ఆసుపత్రులు, మందుల షాపులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లు పని చేస్తాయి. అంతరాష్ట్ర బస్సులు నడుస్తాయి. వీటిలో వచ్చేప్రయాణికులకోసం నిర్ణీత వేళల్లో ఆటోలు, టాక్సీలను అనుమతిస్తారు. అయితే, వీరిదగ్గిర టికెట్టు ఉండి తీరాలి.

ఇవి కాకుండా ఇతర వాహనాలను రోడ్ల మీద అనుమతించరు.

ఇ-కామర్స్ డెలివరీలను అనుమతిస్తారు.పెట్రోలు పంపులు పనిచేస్తాయి.

ఈ కరోనా రాత్రి కర్ఫ్యూ మే 1 ఉదయం అయిదుగంటల దాకా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *