తిరుపతిలో కూరగాయలు మార్కెట్ బంద్

*ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ప్రక్షాళన
*ఉదయం ఏడు గంటల పైన మార్కెట్ బంద్
*పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మార్కెట్లను ఉపయోగించుకోండి
*తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష

 

కూరగాయల మార్కెట్లోలో ప్రజలు గుంపులు గుమికూడా ఉండేందుకు తిరుపతి పట్టణంలో మార్కెట్ ను వికేంద్రీకరించారు. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కే  ప్రజలందరూ పెద్దఎత్తున వచ్చి కూర గాయల కొనుగోలు చేస్తుండటతో  కరోనా వ్యాధి వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున మార్కెట్ ను వికేంద్రీకరించారు.

నగరంలో పలు ప్రాంతాల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు తమ ఇంటి దగ్గరలో ఉన్న మార్కెట్ కే వెళ్లాలని,  ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఈ ఏర్పాట్లు చేశారు.

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష శుక్రవారం ఉదయం 6 గంటలకు అధికారులతో కలిసి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నగరంలో కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని, ముందస్తు చర్యలు గా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లు ప్రస్తుతానికి బంద్ చేసి తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఉపయోగించుకోవాలని గుత్తేదారుల ను కోరారు. కూరగాయలను అధికధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మార్కెట్ వద్ద గల షాపులు వ్యాపార సముదాయాలను పరిశీలించి విక్రయదారులు మరియు కొనుగోలుదారులు సామాజిక దూరాన్ని పాటించడం లేదని, పెద్ద ఎత్తున కూరగాయలు కొనుగోలుకు వస్తున్నారని, మరి గుంపులుగుంపులుగా వ్యాపారులు, కొనుగోలుదారులు ఉండటం వ్యాధి వేగంగా వ్యాపించే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.

పరిస్థితి ఒక కొలిక్కి వచ్చే వరకు రాత్రి 12 నుండి ఉదయం ఏడు గంటల వరకు మాత్రమే మార్కెట్ అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు.

అనంతరం నగరంలో అన్నమయ్య కూడలి వద్ద ఉన్న రైతు బజార్ ను పరిశీలించి వినియోగదారులు రోడ్డు పైకి రాకుండా రైతు బజార్ లోపల మీకు కేటాయించిన దుకాణాల్లో నే వ్యాపారాలు చేసుకోవాలని అని తెలియజేశారు.

కొంతమంది దుకాణదారులు మేయిర్ దృష్టికి ఎస్టేట్ ఆఫీసర్ ఏడు గంటల పైన అనుమతిస్తున్నారని అందువల్ల వ్యాపారాలు రైతు బజార్ ముందు నిర్వహించాల్సి వస్తుందని ఫిర్యాదు చేశారు. తెలియజేశారు.

రైతులు 5 గంటలకు అంతా అనుమతించాలని మేయర్ఎస్టేట్ ఆఫీసర్  ను ఆదేశించారు.

రైతు బజార్ కి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం ఉండాలని కొనుగోలుదారులు కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *