వ్యాక్సిన్ కంపెనీలకు ఎంత డబ్బిచ్చారు: కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న

భారతదేశంలో వ్యాక్సిన్ తయారీ ప్రజాధనంతో జరుగుతున్నందున వ్యాక్సిన్ లను కూడా ప్రజల సరుకుగనే పరగణించాలని సుప్రీకోర్టు కేంద్రానికి తెలిపింది.

” The vaccine manufacturing is publicly funded and hence vaccines are public goods.”

వ్యాక్సిన్ ధరల వ్యత్యాసాలా మీద కంపెనీలు తయారు చేసేవ్యాక్సిన్ ను మొత్తం కేంద్రమే కొనుగోలు చేసి పోలియో వ్యాక్సిన్ ప్రోగ్రాం లాగా కోవిడ్-19 కోసం కూడా ఒక నేషనల్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమం చేపట్టకూడదో చెప్పాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు లో ధర్మాసనం సూచించింది.

వ్యాక్సిన్ లో మూడు రకాల ధరలుండటం అంటే కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు మరొకరేటు, ప్రైవేటు వారికి ఇంకొక రేటు ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, చివరకు ప్రజలకు దగ్గిరకే వెళ్లాల్సిన వ్యాక్సిన్ లకు ఇన్ని ధరలెందుకని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రానికి వ్యాక్సిన్ పాలసీకి సంబంధించి కోర్టు అనేక ప్రశ్నలు వేసింది.

వ్యాక్సిన్ ధరలకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు వేసిన కీలకమయిన ప్రశ్నలివే:

  1. కోవిడ్ సోకి ఆరోగ్యరంగ సిబ్బంది చికిత్స ఇప్పించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటి?

2. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలలో ఎంత ఇన్వెస్టుమెంటు చేశారు?

3. ఈ కంపెనీలకుఅడ్వాన్స్ గా ఎంత మొత్తం చెల్లించారు?

4. వ్యాక్సిన్ లను అభివృద్ధి చేసేందుకు అవరమయిన పరిశోధన సాగించేందుకు కేంద్రం ప్రభుత్వం కటాయించిన నిధులెన్ని?

5. ఆసుపత్రులకు ఎంతెంత ఆక్సిజన్ అందుచేస్తున్నరో రియల్ టైం తాజా సమాచారం అందించేందుకు ఒక ఏర్పాటు చేయవచ్చగదా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *