కోవిడ్ మీద మోదీ మంత్రి వర్గం సమావేశం, ఏడాాది తర్వాత ఇదే…

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా పరిస్థితిని చర్చించేందుకు ప్రధాని మోదీ మంత్రి వర్గం (council of ministers) సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయని కాని మంత్రి వర్గం సమావేశాలు చాలా అరుదు. ఎంతో ముఖ్యమయిన సమస్య లేదా సంకోభం ఎదురయినపుడు విస్తృత మంత్రి వర్గాని సంప్రదించేందుకు  మాత్రమే ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తారు.

ఈరోజు మోదీ మంత్రివర్గంతో కోవిడ్ సంక్షోభం గురించి చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి అందుకేచాలా ప్రాముఖ్యం ఉంది.  మంత్రి వర్గం సమావేశం అంటే మోదీ కొలువుకూటంలో ఉన్న సహాయమంత్రులు (minister of state: MOS) కూడా  హాజరవుతారు. ఏదో కీలకమయిన విషయం చర్చించేందుకే ప్రధాని ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నారని పరిశీలకులు అనుకుంటున్నారు.

కోవిడ్ మరణాలు రోజూ మూడువేలు దాటుతూ ఉండటం,  కోవిడ్ కొత్త కేసుల సంఖ్య మూడున్నర లక్షలు దాటుతూ ఉండటం,  దానికితోడు చాలా కాలం విదేశాలనుంచి సహాయం కోరే పరిస్థితి దేశానికి రావడం, రష్యా, అమెరికా, యుకె,ఇర్లండ్ వంటి దేశాలనుంచి సాయం అందుతూ ఉండటంతో, దేశమంతా ఆక్సిజన్,  వ్యాక్సిన్ లతో పాటు ఆసుపత్రుల కొరత పీడిస్తూ ఉండటంతో మోదీ  విషయాన్ని మంత్రివర్గంతో చర్చించాలనుకుంటున్నారు.

ఇలాంటి సమావేశంలో గత ఏడాది ఏప్రిల్ 6న జరిగింది. మొదటి కోవిడ్ తాకినపుడు,దేశంలో  21 రోజులు సంపూర్ణ లాక్ డౌన్ విధించినపుడు పరిస్థితి చర్చించేందుకు  ప్రధాని మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అది కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది.

ఇపుడు కూడా ప్రధాని వీడియ్ కాల్ కాన్ఫరెన్సింగ్ ద్వారానే మంత్రివర్గంతో మాట్లాడతున్నారు. రేపటి నుంచి  18-45 సంవత్సరాల వారికి  వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. అయితే,చాలా  రాష్ట్రాల్లో 45 సం.పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ అందుబాటులో ఉందా లేదా అనేది చూసుకోకుండా ప్రధాని మే 1 నుంచి వ్యాక్సిన్ నులిబరలైజ్ చేయడం పట్ల తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభ్యంతరం తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  సెప్టెంబర్ దాకా  18-45 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యంకాదని చాలా స్పష్టం చేశారు. ఆయన  45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే  వ్యాక్సిన్ ను  18-45 సం. వారికి వేస్తామని ఆయన నిన్న చాలా స్పష్టంగాచెప్పారు.

గత వారంలో ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు. ఈ వారంరోజుల్లో ఆక్సిజన్ అందక వందలాది మంది ఆసుపత్రులో చనిపోయారు.

ఇదే విధంగా  దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ కూడా కూడా అసంతృప్తితో ఉన్నట్లువార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మోదీ మంత్రి వర్గం సమావేశం ఏర్పాటుచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *