India Corona Update 3.52లక్షల కేసులు : 2,812 మరణాలు

 

భారత్ పరిస్థితికి, ప్రభుత్వ అభ్యర్థనలకు  అమెరికా  ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భారతదేశంలో కరోనా మీద సాగిస్తున్న యుద్ధానికి అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మద్దతు ప్రకటించారు. ఈ సమరంలో భారతదేశానికి అవసరమయిన అన్ని ఎమర్జన్సీ మెడికల్ సప్లైస్ ను అందిస్తామని ప్రకటించారు.ఇది పెద్ద ఊరట..ఇపుడు భారత్ కు ఫ్రాన్స్ , యుకె, డెన్మార్క్, సింపూర్ , ఇజ్రేల ల నుంచి మెడికల్ ముడిసరుకులు దిగుమతి మొదలయింది.

మొదటి సారి కోవిడ్ పాండెమిక్ మొదలయినపుడు భారత తన అవసరాలను కూడా లెక్క చేయకుండా అమెరికా, యుకె లతో  150 దేశాలకు హైడ్రాక్సి క్లోరోక్విన్ సరఫరా చేసింది. ఆసియా, లాటిన్ అమెరికా, ఆప్రికాలలోని 93 దేశాలకు 9.3 కోట్ల డోసులు వ్యాక్సిన్ కూడా సరఫరా చేసింది. దీనిని ఇపుడు ప్రపంచదేశాలు గుర్తించాయి. భారత్ ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.

ఎందుకంటే, భారతదేశంలో ఇపుడు కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తున్న రెండు కంపెనీలు, ఉత్పత్తి పెంచేందుకు అవసరమయిన సరుకులన్నీ(రియోజంట్లు, కొన్ని రకాల మాస్కులు, రసాయనాలు) అమెరికానుంచే దిగుమతి చేసుకోవాలి. అమెరికాలో కూడా పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో దేశ అవసరాలు తీరాకే ఎగుమతుల చేయాలని నిషేధం విధించడంతో భారత కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఇపుడు అమెరికా భారత్ మీద అండగా నిలబడతానిని హామీ ఇచ్చింది.

భారత  దేశాన్నికుదిపేస్తున్న కోవిడ్ మహహ్మారికి  గత 24 గంటల్లో  2,812 మంది బలిఅయ్యారు.  ఆదివారం 14,02,367 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,52,991 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరింది.  కరోన వచ్చినప్పటినుంచి   ఇప్పటివరకుదేశంలో 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారని . సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.

మొత్తం  28,13,658పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసులు 15.82 శాతానికి పెరిగింది. కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్యకి చేరింది. అయితే, నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోటీ 43లక్షల మంది వైరస్‌ను జయించారు.  మొత్తంగా చూస్తే   రికవరీ రేటు పడిపోతావుంది.  అదివారం నాటికి 83.05 శాతానికి పడిపోయింది.

మొత్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 14,19,11,223కి చేరింది.

మహారాష్ట్రలో నిన్న 832 మంది మరణించారు. గత 24 గంటలలో 66వేల పైచిలుకు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏడు లక్షలమందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో 22,933 కొత్త కేసులునమోదయ్యాయి. కోవిడ్ తో 350 మంది ప్రాణాలు వదిలారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *