ఢిల్లీ బాటలో పంజాబ్, తర్వాతెవరు? కెసిఆరా, జగనా లేక…

పంజాబుులో ఈ రోజు నుంచి మహిళలు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణివచ్చు. మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇపుడు కొత్త పంథా. తాను మరొక ఎన్నికల హామీ అమలుచేశానని గర్వంగాచెప్పుకుంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ పథం ప్రారంభించారు.

ఈ పథకం కింద రాష్ట్రంలో 1.31 కోట్ల మహిళలు లబ్దిపొందుతారు. పేద ధనిక అనే తేడా లేకుండా మహిళలంతా ఇక బస్సులలో ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిజానికి ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తామని మాత్రమే ప్రకటించామని, అయితే, ఇపుడు 100 శాతం రాయితీ కల్పిస్తున్నామని ఆయన గర్వంగా చెప్పారు.

మహిళలు కేవలం ఆదార్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆయన ఈ పథకాన్ని ఈరోజు వర్చవల్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని 1036 వూర్లలోని 30,000 మందికి కనెక్ట్ చేశారు.ఇందులో లైవ్ ఒక మహిళ ప్రయాణాన్ని కూడా చూపించారు. ఇందులో సురీందర్ కౌర్ అనే మహిళ బాఘాపురానా నుంచి జలంధర్ బస్సు ఎక్కింది. ఆమె మందులు కొనుక్కోవడానికి జలంధర్ వెళ్తున్నారు. అయితే, ఈ రోజు నుంచి తాను బస్సు టికెట్ చెల్లించనవసరం లేదని ఆమెకు బస్కెక్కాక తెలిసింది. ఆశ్చర్య పోయింది. ఈ ఉచిత ప్రయాణం నాన్ ఎసి బస్సులలో, రాష్ట్రంలో మాత్రమే తిరిగి బస్సులలో మాత్రమే ఉంటుంది. అంతర్రాష్ట్ర ప్రయాణం ఉచితం కాదు.

ఇది మహిళకు పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన కానుక అని కాంగ్రెస్ పార్టీ వర్ణిస్తున్నది.

 

 

 

రెండేళ్ల కిందటే ఢిల్లీలో

నిజానికి ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం పద్ధతి మొదట ప్రవేశపెట్టింది ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఈ పథకం 2019 అక్టోబర్ నుంచే అమలులోకి వచ్చింది. ఢిల్లీ క్యాబినెట్ ఈ పథకం కోసం రు.150 కోట్లను రవాణా శాఖకు సబ్సిడీ కింద కేటాయించింది.

ఈ పథకం వల్లమహిళలకు భద్రత చేకూరడమేకాకుండా ఢిల్లీ ఆర్థిక వ్యవస్థలో వాళ్ల పాత్ర కూడా పెరుగుతుందని ఢిల్లీప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం పింక్ కలర్ టికెట్లను అందిస్తుంది. వాటిని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సులతో పాటు క్లస్టర్ స్కీమ్ ఆపరేటర్లు నడిపేబస్సులలో కూడా ప్రయాణించవచ్చు. ఈ టికెట్లభారాన్ని ఢిల్లీ ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లిస్తుంది. ఢిలీ ప్రభుత్వం ఉద్యోగులకు, స్థానిక సంస్థల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ఎందుకంటే ప్రభుత్వం వారికి ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ అందిస్తున్నది. ఈ వసతిని వాడుకుంటే వారికి అలవెన్స్ రాదు.

తర్వాత కేసీఆరా లేక జగనా

ఈ లెక్కన ఉచితాల బాటలో దూసుకున్న పోతున్న రాష్ట్రాలన్నీ ఎన్నికలకుఒక ఏడాది ముందుగా ఈ పథకాన్నిఓట్లకోసం ప్రయోగించవచ్చు. పంజాబ్ అసెంబ్లీకి 2022 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మహిళల భద్రతకోసమే ఈ పథకమనిప్రకటించినా, నిజానికి ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పథకమే. పరిపాలన వల్ల ఓట్లు పడవని తెలిసిన ప్రభుత్వాలన్ని ఇలాంటి పథకాలద్వారా వోట్లనురాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఈ పథకం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది.

పూర్తిగా కాకపోయినా, 50 శాతం రాయితీతో ఈపథకాన్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇపుడు పంజాబ్ స్కీం ప్రభావం వచ్చే రెండేండ్లలో ఎన్నికలక పోయే రాష్ట్రాల మీద పడవచ్చు. ఆంధ్ర తెలంగాణ ఎన్నికలు ఇంకామూడేళ్ల దూరాన ఉన్నాయి కాబట్టి తెలగురాష్ట్రాల ముఖ్యమంత్రలు అపుడే ఆవేశపడనవసరం లేదు. కాని వారు ఏదో ఒక విధంగా ఎన్నికలనాటికి ఈ పథకం నుంచి స్ఫూర్తి పొందే అవకాశం మాత్రం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *