స్మాల్ సేవింగ్స్ వడ్డీ కోత జి.వొ రద్దు చేసిన నిర్మలా సీతారామన్

స్మాల్ సేవింగ్స్ వడ్డీ మీద కోత విధిస్తూ నిన్నరాత్రి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జి.వొని నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉససంహరించుకున్నారు. చెంపలేసుకుని సారీ చెప్పారు. అది ఏమరపాటు అని చెప్పుకున్నారు.

ఏమరపాటు ఎలా అవుతుంది. జి.వొ ఇష్యూ చేసే ముందుకు ఎంత చర్చ జరుగుతుంది. దాని ఫైల్ మీద ఎంత మంది సంతకం చేస్తారు. ఎవరెవరు ఒకె చేస్తారు. ఒక్క దశలో కూడా ఏమరపాటు అని బయటపడకుండా పోతుందా. ఈజివొ వెనక ఉద్దేశం బాగాలేదని వచ్చిన విమర్శలతో ఆమె పొద్దునే దానిని ఉపసంహరించుకున్నారు.

గత నెలలలో ఉండే వడ్డీరేట్లే కొనసాగుతాయని ఏమరపాటు విడుదల చేసిన జి.వొ నిక్యాన్సిల్ చేశామని చెప్పారు.

పేదల, అల్పాదాయ వర్గాల, రిటైరయిన సీనియర్ సిటిజన్ల జేబులు కత్తిరించాలనుకునే ఈ జివొ దుర్మార్గమయింది..
సేవింగ్స్ అక్కౌంట్లపై మూక్కుతూ మూలుగుతూ పడుతూ ఇస్తున్న 4శాతం వడ్డీని ఒకేసారి అరశాతం (0.5శాతం) కోసేసింది.

ఒక ఏడాది పాటు ఉండే చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై 5.5శాతం నుంచి 4.4శాతానికి, 2ఏళ్ల డిపాజిట్లపై5.5శాతం నుంచి 5శాతం, 3ఏళ్ల డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 5.1శాతం, 5ఏళ్ల డిపాజిట్లపై 6.7శాతం నుంచి 5.8శాతానికి ,సీనియర్ సిటిజెన్ల డిపాజిట్లపై 7.4శాతం నుంచి 6.5శాతానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లలో వడ్డీ కూడా 7.1శాతం నుంచి 6.4శాతానికి తగ్గించారు. మరీ దారుణంగా ఇది గత 46ఏళ్లలో లేని కనిష్టస్థాయికి దించింది. కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీని 6.9శాతం నుంచి 6.2శాతానికి తగ్గించారు. ఇక సుకన్య సమృద్ధి అక్కౌంట్ స్కీమ్‌ నుంచి వచ్చే వడ్డీని కూడా 7.6శాతం నుంచి 6.9శాతానికి తగ్గించారు.

స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో ఎవరు డబ్బు దాచుకుంటారు? జీవితాంతం ఉద్యోగాలు చేసి నాలుగు రూకలు కూడబెట్టుకుని, వాటి మీద వచ్చే వడ్డీతో బతకాలనుకునే చిరుద్యోగులు, కేవలం వడ్డీ డబ్బుల మీద బతకాలనుకునే వర్గాలు స్మాల్ సేవింగ్స్ లో పొదుపు మొత్తాలు దాచుకుంటారు.

కేవలం ఈ వడ్డీ డబ్బుతో బతికేకుటంబాలు కూడా ఉన్నాయి.

అసలే బ్యాంకుల్లో వడ్డీ తగ్గించేశారు. ఇపుడు స్మాల్ సేవింగ్స్ మీద కూడ వడ్డీ కోత విధించారు. దీనితో సినియర్ సిటిజన్లు, అల్పాదాయ వర్గాల వడ్డీ ఆదాయం తగ్గిపోతుందన్నమాట. ఒక వైపు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరొక వైపు వడ్డీరేట్లు ఇలా తగ్గిపోతున్నాయి.పేదల జీవితాల్లో, అల్పాదాయ వర్గాల జీవితాల్లో, సీనియర్ సిటిజన్ల జీవితాల్లో సంక్షోభం సృష్టించడం కాదా ఇది?

“ Interest rates of small saving schemes of GOI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021. Orders issued by oversight shall be withdrawn,”అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *