కర్నాటక వైపు పరుగుతీస్తున్న తెలుగు వాళ్లు… కోవిడ్ నో సర్టిఫికేట్ నియమం

కరోనా పాజిటివ్ కేసులు పెరిగినా లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోవడంతో వైరస్ వ్యాప్తి నివారించేందుకు రాష్ట్రాలు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇందులో దక్షిణాది లో కర్నాటక మొదట ఈ ఆంక్షలను విధిస్తున్నది.

కోవిడ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్న రాష్ట్రాలనుంచి ప్రజలెవరూ కర్నాటకలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టం చేస్తున్నది. ఇతర రాష్ట్రాలనుంచే వారితోనే కోవిడ్ కేసులు కర్నాటకలో పెరుగుతున్నాయనే అనుమానాలు రాష్ట్రంలో ఉన్నాయి.

ఇపుడు  మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చండీగడ్ రాష్ట్రాలనుంచి ప్రజలు కర్నాటకలో ప్రవేశించకుండా నియమం విధించింది.  కర్నాటకలో ప్రవేశించాలంటే కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ అవసరం. ఇదే నియమాన్ని ఆంధ్ర కర్నాటక రాష్ట్రాలకు వర్తింపచేసే అవకాశం ఉంది. ఎందుకంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి.

సాధారణంగా వేసవిలో తెలుగు రాష్ట్రాలనుంచి ఎక్కువ కుటుంబాలు బెంగుళూరు వెళ్తుంటాయి. బెంగుళూరు ఐటి పరిశ్రమలో ఎక్కువ మంది తెలుగువాళ్లున్నారు. అందువల్ల తల్లితండ్రులు వేసవిలో బెంగుళూరుకు వెళ్తుంటారు.  ఏప్రిల్, మే, జూన్ దాకా బెంగుళూరులోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోం  ఇంకా కొనసాగుతూ ఉండటంతో కుటుంబాలన్నీ కలసి ఉండేందుకు అవకాశం ఏర్పడింది.  దీనితో ఎక్కువ మంది బెంగుళూరులో ఉండేందుకుఇష్టపడుతుంటారు.

ఇపుడు కోవిడ్ ఆంక్షలు  విధించే అవకాశం ఉండటంతో ముందే బెంగుళూరు వైపు పరుగుపెడుతున్నారు. ఎందుకంటే, కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ నియమం విధిస్తే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. పొరపాటు న అందులో కోవిడ్ పాజిటివ్ వస్తే బెంగుళూరు వెళ్లడం కష్టం. దానికి తోడు ఇపుడు తెలుగు రోగలక్షణాలు లేకుండా (Asymptomatic) పాజిటివ్ కేసులు కనిపిపస్తున్నాయి. వీళ్లంతా బెంగుళూరు లోకి వెళ్లేందుకు ప్రస్తుతానికి ఆంక్షలు లేవు.  అందుకే ఎక్కువ మంది ముందుగానే తమ బెంగుళూరు లోని కొడుకులు, కూతుళ్ల దగ్గరకు పరిగెడుతున్నారు.

ఇది ఇలా ఉంటే, కరోనా కేసులు కర్నాటకలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో  ఇతర రాష్ట్రాల ప్రజల ప్రవేశం మీద ఆంక్షలు విధించాలని కర్నాటక భావిస్తున్నది.

కర్నాటకలో శుక్రవారం నాడు  2,566 కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు 2523కేసులు నమోదయ్యాయి. బెంగుళూరు అర్బన్ ఏరియాలో 1490కేసులు నమోదయ్యాయి. రెండురోజులు  వరుసగా 2500 పైబడి కేసులు నమోదకావడంతో  రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలుచేయాలనుకుంటున్నది.కొత్త కేసుల వల్ల మరణించివారి సంఖ్య 13 కు చేరింది. దీనితో మొత్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య  12, 484కు చేరింది. ఇపుడు రాష్ట్రంలో 19,553 యాక్టివ్ సులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 2.28 శాతం. మరణాల రేటు 0.5 శాతం.

కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం కర్నాటకలో కనిపిస్తున్న ఎక్కువ కేసులు బయటి నుంచి వచ్చిన  వారు. దీనితో కర్నాటక ప్రజల్లో ఆందోళన మొదలయింది.  కర్నాటక ఐటి కేంద్రం కావడంతో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా వేసవి లో దాదాపు కుటుంబాలుబెంగుళూరులో గడిపేందుకు సిద్ధమవుతూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *