ముగిసిన ‘జాతి రత్నాలు’ సందడి


గత రెండు వారాలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతి రత్నాలు’ సందడి ముగిసింది. రెండు వారాల్లో ఓవర్సీస్ కలుపుకుని 36  కోట్లు కలెక్షన్లు సాధించుకుని నిష్క్రమించేందుకు సిద్ధమైంది. గత వారం విడుదలైన నాల్గు సినిమాలు ఫ్లాప్ కావడం ‘జాతి రత్నాలు’ కు కలిసివచ్చింది. అయితే ఆదివారం తర్వాత నుంచి ఏవో కొన్ని సెంటర్లు తప్ప కలెక్షన్లు బాగా  సన్నగిల్లాయి. ఇక ఈ వారం రెండు పెద్ద సినిమాలు విడుదల కావడంతో ‘జాతి రత్నాలు’ కి ప్రేక్షకులు పూర్తిగా కరువయ్యారు. ‘జాతి రత్నాలు’ లైఫ్ టైమ్ కలెక్షన్లు 30 కోట్లు వుండవచ్చని ముందు అంచనా వేసిందే. ఈ అంచనాకి మించి కలెక్షన్లు వచ్చాయి.

 ‘జాతి రత్నాలు’ థియేటర్ల నుంచి నిష్క్రమించినా ఓటీటీ లో ప్రత్యక్షం కాబోతోంది. దీని డిజిటల్ రైట్స్ ని  అమెజాన్ ప్రైమ్ వీడియో పొందిన విషయం తెలిసిందే. దీంతో ఇది ఏప్రిల్ 10 నుంచి అమెజాన్ ప్రైమ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఏప్రిల్ మూడవ వారంలో స్ట్రీమింగ్ చేయాలని మొదట అనుకున్నారు. ఆ తేదీ ఇప్పుడు ఏప్రిల్ 10 కి మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *