వెళ్లినట్లే వెళ్లి వెనక్కొచ్చిన కరోనావైరస్… ఎలా వ్యాపిస్తున్నదో చూడండి…

దేశంలో రికార్డు స్థాయిలో  కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి గత ఏడాది సెప్టెంబర్ నాటి లాగా తయారువుతూ ఉంది. గత 24 గంటల్లో దేశంలో 53,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 133 రోజుల్లో ఎన్నికల ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరుణ పాజిటివ్ తో 251 మంది మృతి. దేశంలో మొత్తం 3,95,192 యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులు.

ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో  దినసరి కోవిడ్ కేసులు 10,000 లోపుకి పడిపోయాయి. 2021 ఫిబ్రవరి 22న 10,584 కేసులు కనిపించాయి. కొన్ని రాష్ట్రాలలో సున్నా కేసులు నమోదయ్యాయి. హమ్మయ్య కరోనా వెళ్లిపోయినట్లే నని అంతా వూపరిపీల్చుకుని, మాస్క్ అలా చెత్తకుండిలో పడేసి, శానిటైజర్లను గూట్లో మూలకి తోసేసి స్వేఛ్చావాయువులు పీల్చుకునేందుకు అంతా రోడ్డెక్కారు. ఆఫీసులకు వెళ్లారు.  పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. పెద్దవాళ్లు సాయంకాంల బార్లకు వెళ్తున్నారు. సినిమాలకు వెళ్లుతున్నారు. గుళ్లలో కల్యాణోత్సవాలు మొదలయ్యాయి. మాల్స్ కిటకిటలాడటం మొదయింది.

కొంచెం వెనక్కువెళితే, జనవరి 22న  14, 256పాజిటివ్ కేసులు కనిపించాయి. 2020 డిసెంబర్ 22న 23,950పాజిటివ్ కేసులు కనిపించాయి. 2020 నవంబర్ 22న 44,59 కేసులు, అక్టోబర్ 22న 54,366 పాజిటివ్ కేసులు,  2020 సెప్టెంబర్ 22న 83,347కేసులు నమోదయ్యాయి.

2020 సెప్టెంబర్ లో డైలీ కేసలు సంఖ్య దాదాపు లక్షకు చేరింది. సెప్టెంబర్ 17న 97,894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, అక్టోబర్ ఈ సంఖ్య పడిపోవడం మొదలయింది. ఫిబ్రవరి మధ్యకల్లా ఇక కోవిడ్ భయం పోయినట్లే అనిపించింది.

అయితే, మార్చిలో మళ్లి పరిస్థితి తిరగదోడింది. కోవిడ్ వెనక్కొచ్చేసింది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణంగానే ఉన్నా మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ పతాక స్థాయికి చేరుతూ ఉంది.

ఇపుడు సుమారు 400 శాతం పెరిగాయి. గత మంగళవారం నాడు  47,262 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసు లోడ్  3,68,457. అంటే గత ఏడాది నవంబర్ స్థాయికి కేసులు చేరుకున్నాయి. ఇది తగ్గే సూచనలు కనిపించడం లేదు. తగ్గవు అని కూడా చెబుతున్నారు.

కారణం

ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గత ఏడాది డిసెంబర్ 17 నుంచి  2021 జనవరి8 మధ్య ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని వయోజనుల్లో  కేవలం 21.4 శాతం మంది మాత్రమే వైరస్ కు సోకింది. అంటే దేశ ప్రజల్లో ఇంకా చాలా చాలా మంది కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. లాక్ డౌన్ పీరియడ్లో వీళ్లంతా  తప్పించుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేశాక, ప్రజలకు వచ్చిన స్వేచ్ఛా సాతంత్య్రాల నడుమ వైరస్ పండగ చేసుకుంటూ ఉంది. వీపరీతంగా పాజిటివ్ కేసులు కనిపించేందుకు కారణమిదేనని వైరాలజిస్టులు చెబుతున్నారు.  నిజానికి చాలా మంది నిపుణులు సెకండ్ వేవ్ గురించి ఫ్రిబవరిలోనే హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *