భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పేరు ప్రతిపాదన

భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డే తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ ఎన్ వి రమణ పేరును ప్రతిపాదించారు.

ఇపుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ రమణయే సీనియర్ మోస్టు న్యాయమూర్తి. సాధారణంగా రిటైరవుతున్న ప్రధాన న్యాయమూర్తి  తన వారసుడి పేరును ప్రతిపాదించడం ఆనవాయితీ. అయితే కొంతమంది న్యాయమూర్తులు ఇలా చేయకుండా రిటైరవుతూ ఉంటారు. ఇది అరుదు.

అయితే, ఉత్కంఠ మధ్య ఇపుడు జస్టిస్ బాబ్డే జస్టిస్ ఎన్ వి రమణ పేరును   48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిపాదించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలను ప్రధాని న్యాయమూర్తి తిరస్కరించారనే అనుకోవాలి. ఈ  నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించగానే  ఏప్రిల్ 4న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

జస్టిస్ రమణ ెండు కీలమయిన తీర్పులచ్చిన ధర్మాసనంలో ఉన్నారు. ఇందులో ఒకటి ఇంటర్నెట్ ఇపుడు ఫండమెంటల్ రైట్ అని చెబుతూ కశ్మీర్ లో ఇంటర్నెట్ ను బంద్ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలన్నది. ఇక రెండోది,  ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని ఆర్ టిఐ కిందికి తీసుకురావడం. ఇది తీర్పు కాదు కాని, ఒక జడ్జిల కమిటీ చేసిన సిఫార్సు.ఇందులో జస్టిస్ రమణ ప్రధాన పాత్ర పోషించారు.

వారసుడి పేరు సూచించాలని గతవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్  ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఏప్రిల్ 23న రిటైరవుతున్నారు. సాధారణంగా  ఒక నెల ముందు తన వారసుడి పేరును  రిటైరవుతున్న ప్రధాన న్యాయమూర్తి కేంద్రానికి సిఫార్సు చేస్తారు.

ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయితే, జస్టిస్ రమణ (జన్మదినం ఆగస్టు 27,1957) 2022 ఆగస్టు 26 దాకా పదవిలో ఉంటారు.

జస్టిస్ రమణ చుట్టూ వివాదం? ముఖ్యమంత్రి జగన్ లేఖ

మధ్య జస్టిస్ రమణ పేరు వివాదంలో చిక్కుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాల మీద  అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి.  జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లబ్దిదారులని, జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖ దేశమంతా పెద్ద దూమారం రేపింది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రమణ కూతూర్ల మీద సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  స్టే ఇచ్చినా,ఈ వ్యవహారమంతా మీడియాలో రచ్చరచ్చ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం రాదేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే, జగన్ లేఖ తర్వాత ఆంధ్రపదేశ్ ప్రధాన న్యాయమూర్తి బదిలీ కూడా జరిగింది.

అందుకే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే  జస్టిస్ రమణ పేరును ప్రతిపాదిస్తారా లేదా , ఎవరి పేరు ప్రతిపాదించకుండా రిటైరవుతారా అనే చర్చకూడా మొదలయింది. ఇపుడు ఈ వివాదానికి తెరపడింది

ఇలాంటివి కొత్తకాదు…

జస్టిస్ హంద్యాల లక్ష్మినారాయణ దత్తు  చీఫ్ జస్టిస్ నియమితుడడానికి ముందు ఆయన అవినీతి ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలను జస్టిస్ మార్కండేయ కట్జూ తన బ్లాగ్ లో రాశారు. 2జి స్ప్రక్ట్రమ్ అమ్మకాల వివాదంలో జస్టిస్ దత్తు పేరు కూడా వినిపించింది.జస్టిస్ కట్జూ జస్టిస్ దత్తును ఏకంగా అభిశంషించి ఇంటికి పంపాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ చీఫ్ జస్టిస్ కాకుండా ఈ ఆరోపణలు అడ్డుకోలేదు. జస్టిస్ ఆర్ ఎమ్ లోధా జస్టిస్ దత్తు పేరును ప్రధాన న్యాయమూర్తి పదవికి నామినేట్ చేశారు. దీనితో రాష్ట్రపతి 2014 సెప్టెంబర్ 5న ఆయనను భారతప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

 ఇపుడేజంరుగుతుంది?

ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదన రాగానే, ఆపేరు న్యాయశాఖ మంత్రి ప్రధాని ఆమోదనికి పంపిస్తారు. ప్రధాని ఆపైన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణని నియమించాలని రాష్ట్ట్రపతికి సలహా ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *