నేను మరణించకముందే… నన్ను ప్రేమించు

(మలేషియా కవయిత్రి  షరియానా సాద్ (Sharian Saad)  రాసిన కవితకు తెలుగు అనువాదం)

నేను మరణిస్తే
నీ కళ్ళు వర్షిస్తాయి
కానీ అది నాకు తెలియదు కదా!
ఆ విలపించేదేదో ఇప్పుడే విలపించు నాతో కలిసి.

నా శవం పై పూలదండలు వేస్తావ్
కానీ, నేను వాటిని చూడలేను కదా!
నేను పోయాక వేసే కంటే ఇప్పుడే వేయచ్చు కదా!

నన్ను కీర్తిస్తూ మాట్లాడ తావు.
నీ కీర్తనలు నాకు వినిపించవు.
ఆ పొగిడే దేదో ఇప్పుడే పోగడచ్చు కదా!

నా తప్పులు మర్చిపోతావ్
అదినాకు తెలియదు కదా!
అదేదో ఇప్పుడే మార్చి పో

నేను నీకు దూరమవుతాను,
ఆ బాధ నాకు తెలియదు
దానికి బదులు ఇప్పుడే దూర మవ్వు

నాతో మరికొంత సమయం గడపాలని అనుకుంటావు,
ఆ గడిపేదేదో ఇప్పుడే గడుపు

నేను పోయానని నీకు తెలుస్తుంది
నివాళులు అర్పించడానికి నా ఇంటిని వెతుక్కుంటూ వస్తావు కానీ, చాలా ఏళ్ళు మనం మాట్లాడకుండానే గడిపాం.
కనీసం ఇప్పుడైనా నా కోసం చూడు

నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గడుపు.
నీ ఇంట్లో వాళ్ళు, నీ స్నేహితులు, నీ పరిచయస్తులు సంతోషంగా ఉండడానికి నువ్వు ఏం చేయగలుగుతావో ఆ సహాయం చేయి. వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూడు. వాళ్ళను నీనుంచి కాలం ఎప్పుడు శాశ్వతంగా దూరం చేస్తుందో తెలియదు!

నేను వంటరిగా మాట్లాడగల ను, కానీ, మనం కలిసి మాట్లాడుకుందాం.
నేను వంటరిగా నే ఆనందించ గలను, కానీ, మనం కలిసి ఆనందిద్దాం.
నేను వంటరిగా నే చిరునవ్వు చిందించగలను, కానీ, మనం కలిసి నవ్వుకుందాం.

అదే మానవ సంబందాల సౌందర్యం
ఒకరికి ఒకరం మనం ఏమీ కాము
కాబట్టి కలుసుకునే జీవిద్దాం

( స్వేచ్చానువాదం రాఘవ శర్మ)

(Shariana Saad, Malaysia)

One thought on “నేను మరణించకముందే… నన్ను ప్రేమించు

  1. ఈ కవిత ను ప్రచురించినందుకు కృతజ్ఞతలు నాగరాజు గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *