MPTC, ZPTC ఎన్నికలు సాధ్యం కాదు: స్పష్టం చేసిన నిమ్మగడ్డ

ఎన్నికలకు నిర్వహించేందుకు నాలుగు వారాల  ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct MCC) అవసరయింనందున,  ఎన్నిలక సిబ్బందిరకి కరోనా వ్యాక్సినేషన్  తీసుకోవలసిన అవసరం ఉన్నందన తాను  ఎంపిటిసి, జడ్ పిటిసి ల ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

దానికితోడు తాను  మార్చి 31న రిటైరవుతున్నవిషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అందువల్ల ఈ ఎన్నికల బాధ్యతలను తన వారసుడికి వదిలేస్తున్ననని ఆయన చెప్పారు.

The 4 week Model Code of Conduct which is a prerequisite as well as the ECI observations concerning poll staff and vaccination programme, rule out holding of elections under my charge as my tenure is coming to an end shortly i.e.,31.03.2021. These responsibilities are best shouldered and addressed by my
successor. Under these compelling circumstances, the Commission will not be announcing a schedule in case of MPTC/ZPTC elections.

“రెండు దఫాల  ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు అనేక ప్రయాసలు ఎదుర్కొని అంకితభావంతో కష్టించి పనిచేశారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించారు.చివరకు వ్యాక్సినషన్ షెడ్యూల్ ను కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ రోజుల భారత ఎన్నిలక సంఘం ఎన్నికల సిబ్బందిని ముందు వరస కరోన యోధులుగా గుర్తించి ప్రాధాన్యతతో వారిక వ్యాక్సిన్ వేయాలని సూచించింది. కరోనా రెండో ఉధృతి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది అవపరం కూడా. రాష్ట్ర ఎన్నికల సంఘం జాతీయ ఎన్నికల సంఘం విధానాలను గౌరవిస్తూ ఉంటుంది కాబట్టి, వ్యాక్సినేషన్ విషయంలో  ఇదే విధానంగా రాష్ట్రంలో కూడా అమలుకావాలని అభిలషిస్తూ ఉంది,” ఎంపిటిసి, జడ్ పిటిసి ఎన్నికలను నిర్వహించలేకపోతున్నందుకు కారణంగా చూపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *