మునిసిపల్ ఎన్నికల ఫలితాలను స్వాగతించిన టిడిపి

వర్ల రామయ్య (టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు)

పురప్రజల తీర్పుని టీడీపీ స్వాగతించింది.  అదేసమయంలో జగన్ నేత్రత్వంలో జరిగిన ఎన్నికల ప్రస్థానాన్ని ఒక్కసారి గమనించాలని, ఆయన రాష్ట్రముఖ్యమంత్రిగా కంటే మానిప్యులేటర్ గా మంచిపేరు ప్రఖ్యాతులు సాధించాడన పార్టీ ఆరోపించింది. టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఫలితాల మీద స్పందించారు. 

సీఎంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలను మానిప్యులేట్  చేశాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రజలుఏ పరిస్థితుల్లో ఓట్లువేశారో వారికై వారే ఒకసారి సింహావలోకనంచేసుకోవాలి.

90శాతం స్థానాలు గెలవకుం టే మంత్రి పదవికట్, వచ్చేఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ ను, నా వద్దనుంచి ఎటువంటి ఫేవర్ నీకురాదని ఒక ముఖ్య మంత్రి తన పార్టీ నాయకులతో అంటే, ఎన్నికలు సజావుగా జరుగుతాయా?

ఆ విధంగా ముఖ్యమంత్రి చెప్పడం మేనిప్యులేషన్ కాదా? నూటికి నూరుశాతం పురపాలక ఎన్నికల్లో గెలవాలని చెప్పడం మేనిప్యులేషన్  కిందకురాదా? ప్రజలతీర్పుని తాను తప్పపట్టడంలేదు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాను.

గతంలో పోలింగ్ శాతం 73 గా ఉంటే, ఇప్పుడు 62శాతానికి పడిపోయింది. ఆ 11శాతం పోలింగ్ ఏమైందనే దానిపై ముఖ్యమంత్రి ఆలోచనచేయరా?

ముఖ్యమంత్రి మేనిప్యులేషన్ విజయవంతంగా పూర్తైంది. ఎన్ని కల ఫలితాలపై, మంత్రులు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీల పనితీరుపై ఆయన ఆలోచించరనే విషయం నాకు తెలుసు. ఏవిధమైన సరుకులేకుండా బ్రహ్మండంగా చలామణీ అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ కి పారిపో యారంటున్నారు. చంద్రబాబునాయుడు చూసినన్నీ ఎన్నికలు ఆయన చూశాడా?

ఆ విషయం ఆయన తనత లపై చేయిపెట్టుకొని చెప్పాలి. ఈ ఎన్నికలు, ఈ గెలుపు శాశ్వ తమా? గతంలో నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ భారీగా విజ యంసాధించింది. కాకినాడ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలపడానికే భయపడింది. 2014లో టీడీపీఅధికారంలోకి రాకముందు అన్నిఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీనే గెలిచింది కదా? ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అర్థంచేసుకోవాలి. వ్యవస్థలు, పోలీస్ శాఖ, ఎన్నికల అధికారులు, ప్రభుత్వంఎంతలా ఇబ్బందిపెట్టినా మొక్కవోని ధైర్యంతో పోరాడి, టీడీపీ గెలుపేలక్ష్యంగా పనిచేసిన తెలుగుదేశంశ్రేణులకు పార్టీతరుపున నమోవాకాలు (సెల్యూట్) చేస్తోంది.

మైదుకూరు, తాడిపత్రి తెలుగుదేశం శ్రేణులకు ప్రత్యేక అభివాదాలు తెలుపుతున్నాము. కానీ ఈ గెలుపుపై ముఖ్యమంత్రితో సహా, ప్రతిఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రూ.10వేలకోట్లు ఖర్చుపెట్టి గెలిచానని ఒక వైసీపీ అభ్యర్థి చెప్పాడు. అంతసొమ్ము ఖర్చుచేయడం, ప్రజ లనుంచి దాన్నిగుంజడం వైసీపీవారికి కష్టమేమీకాదు. వాలంటీర్లను ఉపయోగించిన తీరు, అధికార యంత్రాంగం బెది రింపులు, ఎమ్మెల్యేలు హూంకరింపులు అన్నీ అధికారపార్టీ గెలుపునక సహకరించాయి.

ఎన్నికలకమిషన్ అవకాశమి వ్వలేదుగానీ, లేకుంటే వాలంటీర్లే ఇళ్లకువెళ్లి, ప్రజలతో ఓట్లు వేయించేవారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, పార్టీకార్యకర్తలకన్నా దారుణంగా వాడుకున్నారు. ఎన్నికల కమిషన్ మాటవినవద్దని చెప్పిన ముఖ్యమంత్రే ఈరోజు రాష్ర్టా న్ని పాలిస్తున్నాడు. ఓడిపోయామన్న దుగ్దతో తాము ఈ మాట చెప్పడంలేదు. దేశంలో ఏరాజకీయపార్టీకి లేనివిధంగా యోధుల్లాంటి 70లక్షలమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. అటువంటి పార్టీ ఓటమిఅంచుల్లో ఉండటంపై ప్రజలంతా ఆలోచనచేయాలి. ముఖ్యమంత్రి, సజ్జలతోపాటు, సత్తిబాబు కూడా సింహావలోకనం చేసుకోవాలి.

ఈ మాత్రం ఫలితాలకే చంద్రబాబునాయుడు భయపడి పారిపోతాడా? ఇలా జరగ డం కూడా ఒకందుకు మంచిదే. అప్రజాస్వామికులు, అవినీతి పరులు, రాజ్యాంగాన్నిఉల్లంఘించేవారు గెలవడమేంటనే ఆలోచన, ఆవేశం టీడీపీకేడర్ లో వచ్చింది. ప్రభుత్వ బెదిరిం పులు, అధికారుల హెచ్చరికలను ఇకపై ఖాతరు చేయబోం. పథకాలు రావని ప్రజలను భయపెట్టి గెలిచిన గెలుపుకూడా ఒక గెలుపేనా అని నేనంటున్నా. పురఫలితాలపై సీఎంతో పాటు, మంత్రులంతా ఆలోచనచేయాలి. దొంగకేసులు పెడతా మన్నా, పోలీసులు బెదిరించినా, పలురకాలుగా వేధించినా టీడీపీ కేడర్ ఎక్కడా చెక్కుచెదరలేదు. మనోధైర్యంతో పోరాడి ప్రజలమదిలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో ప్ర భుత్వం ఏవిధంగా ప్రజలను భయపెట్టిందో చూశాము. ఎప్పు డూలేనివిధంగా పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవాలు ఎలా అయ్యాయి. ఆయనేమైనా అపరసేవాతత్పరుడా? ప్రజల సేవ లో పునీతమవుతున్నాడా? కాలం, కర్మం కలిసొచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడుగానీ, లేకుంటే ఆయన శ్రీకృష్ణ జన్మ స్థానంలో ఉండాలి. ఆ విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా ? రాక్షసంగా వ్యవహరించడం వచ్చుగానీ హుందాగా వ్యవహరించడమనేది జగన్ కు తెలియదు.

సజ్జల రామకృష్ణా రెడ్డి వెటకారం, ఆయనహావభావాలు కొంతకాలం అలాగే ఉండాలి… ఉంచుకోవాలికూడా. గాలికూడాలేని చీకటి గదుల్లో కూర్చున్న సజ్జల నేడు ఎలాఉన్నాడో చూస్తున్నాం. కానీ కాలమెప్పుడూ ఒకేరకంగా ఉండదనే విషయాన్ని ఆయన గుర్తెరగాలి. మహారాజైన హరిశ్చంద్రుడిని కాటికాపరి ని చేసింది ఈకాలమేననే వాస్తవాన్ని గుర్తుంచుకోండి.

ప్రపం చాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి, చనిపోయేరోజుల్లో తన అనుచరులను పిలిచి, ప్రపంచాన్ని జయించాను.. కానీ నా వెంటనేనేమీ తీసుకెళ్లడంలేదు…నా రెండుచేతులు బయ టపెట్టి నన్నుసమాధిచేయండి అని చెప్పాడు. ఆవిధంగానే జగన్ కూడా ఏమీ తీసుకెళ్లలేడు. అపరకోటీశ్వరులైన సజ్జల కూడా ఏమీ తీసుకెళ్లలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కూడా అదేపరిస్థితి. కొన్నివందల ట్రక్కులు, బుల్డోజర్లు కొన్నాడు. అవేవైనా పెద్దిరెడ్డి తీసుకెళ్లగలడా? బెంగుళూరులో భారీ ప్యాలెస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి. మూడు, నాలుగు హెలికాఫ్టర్లు ఒకేసారి దిగుతాయట అక్కడ. అంతపెద్ధ రాజ భవనం ఎలాకట్టారంటే ఆయనచెప్పడు. ఎదుటివారికి చెప్పే టందుకేనీతులున్నాయంటాడు. ఆయనమాత్రం పాటించడు.

పురఫలితాలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, పట్టుదల తో పోరాడిన టీడీపీ కేడర్ కు అభివాదం చేస్తున్నాను. ముఖ్యంగా మైదుకూరు, తాడపత్రి టీడీపీశ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *