విశాఖ తూర్పు టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి అరెస్టు

విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షు డు ప్రణవ్‌గోపాల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఏయూ హైస్కూల్‌ వద్ద రిగ్గింగ్‌ జరుగుతుందన్న సమాచారంతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

దీంతో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు, 3వ పట్టణ పీఎస్‌కు తరలించారు. ఆ సమయంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *