‘కదలిక’ కరువు కథల ప్రత్యేక సంచిక ‘‘తరతరాల రాయలసీమ’’ సెప్టెంబరు 89, డిసెంబరు 91 సంచికగా విడుదలయింది.
ఇందులో 65 వ్యాసాలు, 12 విజ్ఞప్తులు ఉన్నాయి. రాయలసీమ చరిత్రంతా కరువుకాటకాదుల చరిత్రగా నమోదయింది.
మధ్యమధ్యలో కొన్ని వైభవాలు చూసినా, మూలాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి.
అంశం: ‘తరతరాల రాయలసీమ’
వక్త: భూమన్
తేదీ: 13.03.2021, శనివారం
సమయం: 6:30 pm
సాహిత్య, సామాజిక చింతనలో అద్భుతమైన ప్రగతి సాధన చేస్తున్న ఈ సీమ… నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో సమకాలీన అభివృద్ధికి ఆమడదూరాన ఉంది.
విజయనగర కాలపునాటి వైభవాన్ని ఎంతకాలం ముచ్చటించుకుంటాం?
బ్రిటిష్ వారు తమకోసం చేసుకున్న కొన్ని పనులను చూసి ఎంతకాలం మురిసిపోతాం? ఎన్నేళ్లుగా ‘శ్రీభాగ్’ జపం చేస్తూ కాలం వెళ్లబుచ్చుదాం?
‘శ్రీభాగ్ ఒప్పందం’తోనే ‘‘రాయలసీమ రాష్ట్ర’’ ఆకాంక్షను చంపేసిన వైనాన్ని చెప్పొద్దా??
ఏఏ రంగాల్లో రాయలసీమ అణగదొక్కబడిందో, ఏంచేస్తే మిగిలిన ప్రాంతాల పాదంలో పాదం అవుతుందో, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అయితే ఎంతెంత మేలో… రండి చర్చించుకుందాం! రమ్మని ప్రముఖ రచయిత భూమన్ ఆహ్వానిస్తున్నారు.
భూమన్ అంటే ఎవరు?
త్రిపురనేని మార్గదర్శకత్వంలో ఏర్పడిన 12మంది ‘లే’కవుల్లో భూమన్ ఒకరు!యవ్వనంలో విప్లవ సాహిత్యకారుడు, నడివయసులో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమకారుడు.
చలాన్ని చూడాలని టిక్కెట్టు లేకుండా ప్యాసింజర్ రైలెక్కి, తిరువణ్ణామలై చేరినవాడు.
‘‘నేను నక్సలైట్‌గా మారాను, ఇంక మీ దగ్గరకు రాను’’ అని అమాయకంగా చలానికి చెప్పినవాడు.
కొండపల్లి సీతారామయ్య, కేవీఆర్, వంటి పెద్దలతో ఈయనకు పరిచయాలు!
ఎమర్జెన్సీలో అరెస్టు అయ్యి, 18 నెలలు ముషీరాబాద్ జైల్లో గడిపిన అనుభవాలు!!
ఎమర్జెన్సీలో ఉద్యోగం నుంచీ డిస్మిస్ అయినవాడు.
‘జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య’లో పనిచేసినవాడు. ఈయన, రాయలసీమ గురించి అధ్యయనం చేసినవాడు. ‘కదలిక సంపాదక వర్గం’లో ఒకడు.
‘కదలిక’ సంచిక కోసం అనేక వ్యాసాలు రాసినవాడు. 1985లో ‘రాయలసీమ పాదయాత్ర’లు చేసినవాడు. ‘‘సిద్ధేశ్వరం’’ ఉద్యమంలో అరెస్ట్ అయినవాడు.
భూమన్ అంటే మాటల విస్ఫోటనం. ప్రతివారమూ శేషాచలం కొండలను హత్తుకునే ట్రెక్కర్! ‘తరతరాల రాయలసీమ’ వ్యాససంపుటి గురించి ఈ శనివారం సాయంత్రం భూమన్ ప్రసంగిస్తారు.
భూమన్ ఫేస్‌బుక్ లైవ్ ప్రసంగాన్ని చూడటానికి, మార్చి 13, శనివారం సాయంత్రం 6:30కు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి
https://www.facebook.com/bhumana.subramanyamreddy
ఇది కూడా కూడ చూడండి