ఉగాదికి నాని టీజర్?


నేచురల్ స్టార్ నాని 27 వ చిత్రం శ్యామ్ సింఘా రాయ్ శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

దీనికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే  శ్యామ్ సింఘా రాయ్ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.

ఇప్పుడు తాజా రిపోర్ట్ ప్రకారంఏప్రిల్ నెలలో ఉగాది పండుగ సందర్భంగా టీజర్ ను ఆవిష్కరించాలని యోచిస్తున్నారుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాని కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా శ్యామ్ సింఘ్ రాయ్‌ ను భారీ బడ్జెట్‌తో రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. 

ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

ఇందులో సాయి పల్లవిమడోన్నా సెబాస్టియన్, కిర్తి శెట్టి నాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్యామ్ సింఘా రాయ్ ని  నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

ఇంతకుముందు నాని స్పోర్ట్ బేస్డ్ డ్రామా జెర్సీ కి పనిచేసిన సాను వర్గీస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా,  మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చుతున్నారు.

ఇదిలా వుండగా, తర్వాతి సినిమాలకి నాని భారీగా 14 కోట్లకి రెమ్యూనరేషన్ పెంచేసినట్టు ఈ రోజు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *