కృష్ణా జిల్లా ఓటింగ్ సరళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళిని విజయవాడలో ని బిషప్ గ్రే సి హై స్కూల్ పోలింగ్ కేంద్రలో  ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ పరిశీలించారు.

కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్, మునిసిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, ఎన్నికల పరిశీలకులు సుబ్రమణ్యం తదితరులు

కమిషనర్  ఓటర్లతో మాట్లాడుతూ వసతులతో పాటు అధికారుల సహకారం వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ మీద ప్రభుత్వం ఏర్పాట్ల గురించి ఓటర్ల స్పందన తెలుసుకున్నారు.

ఇది ఇలా ఉంటే, కృష్ణా జిల్లా  నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో  మధ్యాహ్నం 1.00 గంట వరకు 41.49 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ వెల్లడించారు.

విజయవాడ :38.14 శాతం

మచిలీపట్నం :46.78

నూజివీడు : 50.14

పెడన : 55.53

తిరువూరు : 56.64

నందిగామ: 53.48

ఉయ్యురు : 56.71

మచిలీపట్నం లో కొద్ది సేపు ఉద్రిక్తత..

తెలుగు దేశం  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వోట్ హక్కు వినియోగించుకోవటానికి వచ్చినపుడు  వైసిపి, టిడిపి కార్యర్తల మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి రెండు కార్లలో వచ్చారని వైస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. ఆ విషయం మీకు ఎందుకు టిడిపి వాళ్లు జవాబిచ్చారు. దీనితో  ఒకరి నొకరు అరచుకోవడం, తసుకోవడం జరిగింది.

వెంటనే స్పెషల్ పార్టీ, రాపిడ్ యాక్షన్ టీంలను అధికారులు రంగంలోకి దించారు.  అందరిని చెవోటింగ్ కేంద్రం నుండి దూరంగా తరిమేశారు.

అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డియస్పీలు తర్వాత వోటింగ్ కు అంతరాయం లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *