‘చంద్రబాబు కోట’ కుప్పం లో టిడిపి పరాజయానికి కారణాలు

అమరావతి ఫిబ్రవరి18: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని పరాభవించారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.

బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రౌడీయిజం రాజ్యమేలి అక్రమ మార్గాలలో మెరారీటీ పంచాయతీ గెలుపొందారని చెప్పారు. రెండు రోజుల ముందు నుంచే పొరుగూరు రౌడీలని దింపి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు.

1989 నుంచి ఏడు సార్లు తిరుగులేని మెజారిటీ సాధిస్తున్న చంద్రసుబాబుపై ఈర్ష్యతో వైకాపా నేతలు అనేక అడ్డదారులు తొక్కారని దుయ్యబట్టారు. తాము చెప్పినట్లు ఓట్లు వేయకపోతే సంక్షేమ పధకాలు నిలిపేస్తామని బెదిరించారని చెప్పారు.

పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నేత్రుత్వంలో, ఎంపి రెడ్డెప్ప సారథ్యంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.

నియోజకవర్గంలోని 89 పంచాయతీలలో ఓటుకు రెండు నుంచి ఐదు వేలు చొప్పున పంచారని తెలిపారు. కర్నాటక మద్యం ఏరులై పారించారని చెప్పారు.

పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరించారని ఆరోపించారు.కుప్పంలో ఓడిపోయింది ప్రజాస్వామ్యమే తప్ప చంద్రబాబు కాదన్నారు. విశ్వసనీయత, శాంతి, నీతినిజాయితీలకు మారు పేరైన కుప్పం ప్రాంతాన్ని ఉన్మాదంతో కలుషితం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

కాగా పంచాయతీ ఎన్నికల్లో అంబేద్కర్ రాజ్యాంగానికి రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య పోరాటం జరిగిందన్నారు.

టీడీపీ చొరవతోనే బలవంతపు ఏకగ్రీవాలు తగ్గాయని దీంతో వైసీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *