నా పేరు రాహుల్, సర్ అనొద్దు, ‘రాహుల్ అన్న’ ఒకె : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు పుద్దుచ్చేరిలో ఒక కళాశాలలో మట్లాడుతూ తనని కావాలంటే రాహుల్  అన్న అని పిలవండి, సర్ అని మాత్రం పిలవవొద్దు అని చెప్పి విద్యార్థుల మనుసు దోచుకున్నారు.

ఈ రోజు అక్కడి భారతీ దాసన్ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులతో ఆయన కొద్ది సేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా చాలా మంది విద్యార్థినులు ఆయన ‘సర్ ’  అని పిలవడం మొదలుపెట్టారు. దీనికి ఆయన వారికి సలహా ఇస్తూ, ‘కాలేజీలో ప్రిన్సిపాల్ ని సర్ అని పిలవండి, టీచర్ అని సర్ అని పిలవండి, నన్ను మాత్రం సర్ అని పిలవొద్దు,  రాహుల్ అని మాత్రం పిలవండి, నా పేరు రాహుల్,’ అని హర్షద్వానాల మధ్య సలహా ఇచ్చారు.

“My name is Rahul. You can call me Rahul. You can address your principal and your teachers as ‘sir’.”

విద్యార్థులకు అలా రాహుల్ ని పేరుతో పిలవడం చేత కాలేదు. చాలా మంది సర్… సర్ అని పిలవడం మానలేదు. ఆయన పదే పదే  వారికి సలహా ఇస్తూ, నా పేరు రాహుల్ అని గుర్తుంచుకోండని చెప్పారు.

ఇంతలో ఒక అమ్మాయి లేచి నిలబడి, ‘మిమ్మల్ని రాహుల్ అన్నా,’ అని పిలవవచ్చా అని అడిగారు. దానికి రాహుల్ సరే అన్నారు.

“Yeah, you can call me ‘Rahul anna’.  That’s good.”
 #Rahulanna హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోలన్నీ వైరలవుతున్నాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *