స్టీల్ ప్లాంట్ మీద ఒరిస్సా ఉన్నతోద్యోగుల పెత్తనం : విజయసాయి

ఈ నెల 20వ తారీఖు ఉదయం గం.8.30 నిమిషాల నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్నటువంటి గాంధీ విగ్రహం నుంచి వైసిపి రాజ్య సభ సభ్యుడు విస్టీల్‌ ప్లాంట్ ప్రయోజనాల్ని కాపాడేలా విశాఖ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర  చేస్తున్నారు.

విశాఖపట్నంలోని అన్ని నియోజకవర్గాలు కవర్‌ చేసుకుంటూ సౌత్ నుంచి నార్త్‌, ఈస్ట్‌, గాజువాక నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. సుమారు 23 నుంచి 25 కి.మీ నడుచుకుంటూ వెళ్లి విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎదుట సమావేశమై వైయస్‌ఆర్‌సీపీ నిరసన చేస్తుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం ఢిల్లీకి వినపడేలా తెలియజేయటం జరుగుతుందని ఆయన విలేకరులకు తెలిపారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయాలో వాటిని అన్నింటినీ చేయటానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని  ఇందులో ఎటువంటి రాజీ ప్రసక్తే లేదని స్పష్టంగా చెబుతున్నామని ఆయన అన్నారు.

విశాఖ స్టీల్ ప్రవేటీకరణ వ్యవహారం  వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు తెలుసని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ పాదయాత్ర  చేస్తున్నారు.

‘చంద్రబాబులాగా డ్రామాలు ఆడే అలవాటు మాకు లేదు. మా నాయకుడు శ్రీ జగన్ ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. చెప్పింది చేస్తారు. చంద్రబాబు డ్రామాలు నమ్మవద్దు. మేం చేసి చూపిస్తాము,’ అని జయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే…

పాదయాత్ర అనేది రాజకీయాలకు సంబంధం లేదు. స్టీల్ ప్లాంట్ హక్కులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట యాత్ర చేయటం జరుగుతోంది. దీనికి రాజకీయాలకు ముడిపెట్టవద్దు.

ప్లాంట్‌లో ఉన్నతాధికారులు అంతా ఒరిస్సా వారే కావటం, వారి పెత్తనం వల్ల కూడా సంస్థకు అన్యాయం జరుగుతోందని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలంటే గనులను కేటాయించాలి. అప్పుడే ఒక్కో టన్నుపైన రూ.6-7వేలు ఆదా చేసినట్లు అవుతుంది. విశాఖ ఉక్కు విస్తరణలో 3 మిలియన్‌ టన్నుల నుంచి 7.3 టన్నుల సామర్థ్యానికి పెంచటంతో విపరీతమైన రుణభారం సంస్థపైన పెరిగింది. ఆ రుణంపై ఇంచుమించు 14% వడ్డీని సంస్థ కడుతోంది. దీనివల్ల స్టీల్‌ ప్లాంట్‌కు ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. అందువల్ల రుణాలను ఈక్విటీ కింద మార్చాలి.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రొడక్షన్‌ను స్థిరీకరణ చేస్తే ఆరు నెలల్లో సంస్థ లాభాల్లోకి వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ బలంగా నమ్ముతోంది.

13 కార్మిక సంఘాలతో కలిపి అఖిలపక్ష సమావేశానికి హాజరు అయ్యాం. 13 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి  వారికి వైయస్ఆర్‌సీపీ తరుపున సంఘీభావం తెలిపాం. కార్మికులకు సంఘీభావంలో భాగంగానే స్టీల్‌ ప్లాంట్ ఎదుట మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ధర్నాలో పాల్గొనటం జరిగింది. భవిష్యత్‌లోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *