నేటి మేటి ఫోటో… దీర్ఘాలోచనలో హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఎపుడూ బిజీగా ఉంటాడు. నవ్వుతూనే కనిపిస్తాడు.అరమరికలు లేకుండా అందరితో కలిసిపోతారు. కలగోపుగా మాట్లాడుతూ ఉంటారు.

కాని, ఈ రోజు ఈ ఫోటోలో హరీష్ రావు ఎపుడూ లేని విధంగా దీర్ఘాలోచనలో ఉన్నారు. ఎందుకో తెలియదు. ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు.

టిఆర్ ఎస్ ప్రభుత్వంలో, తెలంగాణ ప్రజల్లో హరీష్ రావు అంటే ఒక ప్రత్యేకత. ఆయన పర్యటనలు ఒక ప్రత్యేకత. ఆయన ప్రజలతో జరిపే ఇంటరాక్షన్  ఒక ప్రత్యేకత. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ ఎవరికీ లేని విధంగా తన కంటూ ఒక ప్రత్యేకత   ఉందని చాటుకున్నారు. ప్రజలూ గుర్తించారు.  తనకు ప్రజలకు మధ్య సెక్యూరిటీ అడ్డుగోడ  కాకుండా చూసుకుని జనానికి ఆయన బాగా దగ్గరయ్యారు. అందుకే హరీష్ అంటే జనంలో విపరీతమయిన క్రేజ్ . ఈ ఫోటో చూడండి, ఫోటో కోసం, సెల్ఫీ కోసం జనం ఎలా ఎగబడుతున్నారో.

సంగారెడ్డి జిల్లా  నారాయణ ఖేడ్ లో గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ను హరీశ్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఇది అక్కడి సందడి.

అంతేకాదు, నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో నాగులగిద్ద మండలం కర్సిగుత్త గ్రామము బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ని చూసి  ఒక విద్యార్థిని ఆనందంతో ఉప్పొంగి పోతూ  మాట్లాడింది.

“మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తా నని కలలో కూడా అనుకోలేదు సర్.పేపర్ లలో టీవీల్లో చూశాను.  ఈరోజు ఇలా  ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషంగా ఉంది సర్,” పట్టలేని ఆనందం వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమం మధ్యలో తన సహజ ధోరణిలో హరీష్ చిరునవ్వులు చిందిస్తూ ఉండకుండా దీర్ఘాలోచనలో పడ్డారు. ఆయన దేని గురించి ఆలోచిస్తుంటారు. ఆయన సొంతంగా ఏదో ప్లాన్ గురించి ఆలోచిస్తున్నారా? ఇతర వాళ్ల ప్లాన్ గురించి ఆలోచిస్తున్నారా?

ఒక గెస్సేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *