” సారీ, రాజకీయాల్లోకి రావడం లేదు, ప్రజాసేవ చేస్తా”

రజినీ కాంత్   రాజకీయ పార్టీ ప్రకటన రద్దయింది.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ లోసుదీర్ఘ వివరణ ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశాన్ని విరమించుకుంటున్నట్లు  ఆయన ప్రకటించారు.
దీనితో దాదాపు దశాబ్ద కాలంగా రజినీ రాజకీయ ప్రవేశం గురించి వస్తున్న వూహాగానాలకు శాశ్వతంగతా తెరపడింది. తాను పార్టీ పెడుతున్నట్లు మూడేళ్ల కిందట రజినీ మొదట ప్రకటించారు. తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే, అపుడపుడు దీనికి భిన్నమయిన సంకేతాలు కూడా ఆయన నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రకటనల్లో కూడా వూగిసలాట, అస్పష్టత కనిపించేవి. చివరకు ఇదే నిజమయింది.  ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని ఈ రోజు తెేలిపోయింది.
కుటుంబసభ్యుల నుంచి ముఖ్యంగా కూతుళ్ల నుంచి రాజకీయ ప్రవేశానికి వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. రాజకీయాల్లో తిరిగేందుకు ఆరోగ్యం అనుకూలంగా లేదని, అందువల్ల పార్టీ పెట్టే ప్రతిపాదన విరమించుకోవాలని కూతుళ్ల నుంచి వత్తిడి వచ్చిందని, అందుకే ఆయన రాజకీయప్రవేశాన్ని విరమించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ అపోలో నుంచి విడుదలయిన రెండు రోజుల్లో నే ఇలాంటి ప్రకటన రావడం ఆశ్చర్యం.
తను అభిమానులకు ఆయన క్షమాపణ చెప్పారు.మూడేళ్లుతా తన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నవచ్చిన అభిమానులందరికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మూడేళ్లకు తనకు మద్దతునిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.
రాజకీయాలలోకి ప్రవేశించకుండానే తన  ప్రజసేవకొనసాగుతుందని ఆయన చెప్పారు.
” పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడంలేదని చెప్పేందుకు విచారిస్తున్నాను. ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాల్సి రావడం చాలా బాధకరం. నా నిర్ణయం అభిమానులను, ప్రజలను నిరాశకు గురించేస్తుందని నాకు తెలుసు. అందుకే భారమైన హృదయంతో క్షమాపణలు చెబుతున్నాను,’ అని ట్వీట్ చేశారు
కరోనా పాండెమిక్ సమయంలో ఎన్నికల్లో పోటీచేస్తేవాళ్లు ఆర్థికంగా చితికిపోతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ ప్రకటన తేదీని ఆయన డిసెంబర్ 31 ప్రకటించాల్సి ఉంది. రెండు రోజుల కిందటే రజినీ కాంత్ అధిక రక్తపోటు సమస్యకు చెందిహైదరాబాద్ అపోలోనుంచి విడుదలయయ్యారు. ఆయన గుంపుల్లో తిరగరాదని, అలసట వచ్చే పనులు చేయరాదని డాక్టర్లు సూచించారు. అందుకే ఈ ఆయనపార్టీ ప్రకటనవాయిదావేసినట్లు ప్రకటించారు.రజీని కాంత్  రాజకీయ ప్రవేశానికి ఎపుడూ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయన ఆరోగ్య సమస్యకూడా ఇపుడుతోదయింది. గతంలో కూాడా  ఒకసారి ఆరోగ్యం కారణంగానే పార్టీ పేరు ప్రకటించలేదు. అంతకుముందు రాజకీయ అనిశ్చిత కారణంగా కొద్ది రోజులు మౌనం వహించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *