చైనా స్మార్ట్ ఫోన్లంటే ఇంకా ప్రజలు ఎగబడుతున్నారు….

చైనా స్మార్ట్ ఫోన్లకు ఇండియాలో డిమాండ్ తగ్గనే లేదు. ఈ అక్టోబర్ లో గత ఏడాది అక్టోబర్ కంటే  17లక్షల  ఎక్కువ ఫోన్లను భారతీయులు ఎగబడి కొన్నారు.
భారత్ కు చైనా వైరం పెరిగినా, సరిహద్దున ఉద్రిక్తత ఏర్పడినా, సుమారు 200 చైనీస్ యాప్లను భారతదేశం నిషేధించినా,  దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్  భారత్ ’ అని ప్రకటించినా  భారతీయులు చైనా స్మార్ట్ ఫోన్లను వదలడం లేదు.
టెక్ మార్కె ట్  ట్రెండ్స ను విశ్లేషించే సంస్థ ఐడిసి  (ఐడిసి ) లెక్కల ప్రకారం ఈ అక్టోబర్ లో గత  ఏడాది అక్టోబర్ తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ మార్కెట్  42 శాతం వృద్ధి సాధించింది.ఈ ఏడాది అక్టోబర్ లో   21 మిలియన్ స్మార్టో ఫోన్లు ఇండియాలోకి దిగుమతి అయ్యాయి.
ఈ ఏడాది మూడో క్వార్టన్ ఆన్ లైన్ ఫెస్టివల్స్ భారీగా నిర్వహించడంతో భారతీయులు ఎగబడి చైనా ఫోన్లు కొనుగోలు చేశారు.
సియోమి, వివో, రియల్మి, ఒపో అనే కంపెనీల ఫోన్లు భారీగా అమ్ముడు పోయాయి. 2019 అక్టోబర్ లో 46.07 లక్షల చైనా స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోతే, ఈ ఏడాది, అన్ని రకాల నిషేధాల తర్వాత, భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహంచాలని ప్రధాని పిలుపు ఇచ్చాక  63.01లక్షల స్మార్టు ఫోన్లు అమ్ముడు పోయాయి. అంటే 17 లక్షల ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *