పవన్ కల్యాణ్ కు మంత్రి కొడాలి నానీ చురకలు (వీడియో)

 వైసిపి ఎమ్మెల్యేల మీద తీవ్రమయిన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రజాప్రతినిధులకు పేకాట క్లబ్బులు నిర్వహించడంలో బాగా శ్రద్ధ ఉంది. అయితే, రోడ్ల వంటి వసతులను కల్పించడం ఆ శ్రద్ధ చూపడం లేదని  జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు గుడివాడ ఎమ్మెల్యే రాష్ట్రమంత్రి కొడాలి నాని జవాబు చెప్పారు. కొడాలి నాని కూడా అంతే తీవ్రంగా దాడి చేశారు.
కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  గుడివాడ వచ్చిన పవన్ నిన్న వైసిపి నేతల మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
గుడివాడలో పేకాట క్లబ్బులు మూయించానా? ఆడిస్తున్నానా?సీఎం జగన్ ఏపీలో క్లబ్బులు మూయిస్తున్నారా? ఆడిస్తున్నారా?పవన్ బోడి లింగం కాబట్టే ప్రజలు కింద పడేశారు. బోడిలింగం ఎవరో గాజువాక, భీమవరం ప్రజలకు తెలుసు….అని నాని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *