(భూమన్)
దూరంగా ట్రెకింగ్ పోనపుడు నేను పోయే నాకిష్టమయిన ప్రదేశం సుద్దకుంట. ఇది తిరుపతిలోనే ఉంది. అలిపిరి-చెర్లోపల్లె రహదారి మధ్యలో వేదికే విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉండే దట్టమయిన అడవి. అరవింద్ కంటి ఆసుపత్రి గుండా గాని, సైన్స్ సెంటర్ కుడిపక్కగా గాని పోతే, ఈప్రాంతానికి చేరుకోవచ్చు. రహదారి పక్కనే గాని లోనికి వెళ్లగానే అడవి వాతావరణం తప్పితే మరొకటి ఉండదు. రెండోఘాటక కింది భాగాన కొండల సానువుల్లో ఉంటుంది.
ప్రతిసారి జింకలు దర్శనమిస్తుంటాయి. జింకలు చెంగు చెంగున దూకటం కళ్లారా చూడగలిగాను. అప్పుడప్పుడు కణుతులు, అడవి పందులూ కనిపిస్తాయి. నెమళ్లు తప్పనిసరిగా ఉంటాయి. పక్షుల కిలకిలా రావాల మధ్యన అత్యంత ఆహ్లాదకరమయిన వాతావరణంలో తనివి తీరా తిరగవచ్చు. అంతా 6 కి.మీ మించి ఉండదు.
అక్కడ ఉన్న రాళ్ల దారి ఎప్పటిదో? పురాతన కాలం నాటి నుండి ఉన్నట్లుంది. బహుశా కర్నాటక రాష్ట్రం నుంచి వచ్చేవారికి అలిపిరి దారై ఉంటుంది.
ఆ ప్రదేశం మధ్యలో చక్కటి కోనేరు కూడా ఉంది.
పక్కనే గుడి వంటి నిర్మాణం ఉంది. పూర్తిగా శిధిలమయింది. కొంచెం దిగువన కట్టడం ఉంది. అది నీటి నియంత్రణకు సంబంధించినదిగా ఉంది.
అలిపిరిదగ్గరిగా పోతే, సన్నటి కాల్వ కనిపిస్తుంది. వానాకాలంలో నీరుపారుతున్నపుడుఇది ఎంతో ఆహ్లాదకరమయిన వాతావరణం సృష్టిస్తుంది. పైకి ఎక్కితే ఘాట్ రోడ్డులోని వినాయకుని గుడి, దిగదాల చెక్ పోస్టు కనిపిస్తాయి.
పక్కకుతిరిగి ఇంకో దారి పట్టుకుంటే సుద్దకుంట చేరుకోవచ్చు. ఈ ప్రాంతం పూర్తిగా సుద్ద. దీన్ని దేనికోసం వాడే వాళ్లో తెలియడం లేదు. ఆనీళ్లలు తాగటానికి, దుప్పులు, కణుతులు, పందులు వస్తుంటాయి.
కూతవేటంత దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ఎవరూ రాకపోవటమే వింత. అడవంటే భయమా?
అరవింద కంటి ఆసుపత్రి ఎదురుగా గేటుపెట్టి ఎంతో కొంత ఫీజు పెట్టి సందర్శకులను అనుమతిస్తే చాలా గొప్పగా ఉంటుంది. అని జాగ్రత్తలూ తీసుకుని అటవీ శాఖ వారు పూనుకుని ఈ ప్రదేశాన్ని అభివృద్ఢి చక్కటి అడవిఅనందాలను ప్రతిఒక్కరికి అనుభవంలోకి తీసుకురావచ్చు.
ఏమార్పు చేయకుండా ఉన్నది ఉన్నట్లు చూపరులకు వదిలేస్తే అదొక మహదానందం. కావాలంటే లోపల సెక్యూరిటీ ఏర్పాటుచేయవచ్చు.
ఈ ప్రాంత ప్రాముఖ్యతను చరిత్ర పరిశోధకులు చెప్పవలసి ఉంది. ఇట్లాంటి ప్రాంతాల అన్వేషణే గొప్ప అచీవ్ మెంట్.
తిరుపతి బహుశా అదృష్టవంతులు. చటూ చూసినంత సహజసౌందర్యం ఉంది. అనుభవించినంత ప్రకృతి సంపద ఉంది. దీనిని నలుగురికిచేరవేసే పూనిక ఏది?
More Trekking in Seshachalm Hills, Tirupati, Andhra Pradesh, India
- ఈ రోజు ట్రెకింగ్ కనువిందు చేసే మూలకోన జలపాతానికి…
- ఈ రోజు ట్రెకింగ్ ‘వేయిలింగాల కోన’ అడవుల గుండా (గ్యాలరీ)
- ఈ రోజు ట్రెకింగ్: చంద్రగిరి కోటలో ‘ఉరికంబం’
- ఈ రోజు కాలభైరవ గుట్టకు ట్రెకింగ్…అద్భుతాల ఈ గుట్ట ఇపుడు అనాథ (గ్యాలరీ)
- చారిత్రక విశేషాల ఖజానా ‘తాటికోన’ కు ఈ ఉదయం ట్రెకింగ్
- తిరుమల కొండ ప్రకృతి సోయగాలు… గంట మంటపానికి ట్రెకింగ్