బ్రహ్మోత్సవాలకు దర్భ చాప, తాడు సిద్ధం, వీటి ప్రాముఖ్యం తెలుసా?

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. బ్ర‌హ్మోత్స‌వాల కోసం సెప్టెంబర్ 18న శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మ‌ధ్య‌ అంకురార్పణ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేశారు.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది.
సెప్టెంబర్ 19న ధ్వజారోహణం 
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 19వ తేదీ శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం లో వాడే ఒక ముఖ్యమయిన వస్తువు దర్భ గడ్డి. దీనిని వృక్ష శాస్త్ర నామం డెస్మోస్టాఖ్యా బైపినేటా (Desmostachya Bipinnata). హిందూ సంప్రదయాంలో దర్భ పుల్లలకు చాలా ప్రాశస్త్యం ఉంది.రుషులు దర్భ తో చేసిన కుర్చీల మీద కూర్చుంటారు. దర్భ చాపలమీద శయనిస్తారు. ధ్యానంలో దర్భ చాపలనే వాడాలి. దర్భచాపలమీద ఉన్ని జంబుకాణం లేదా జంతుచర్మం పరుచుకుని కూర్చుంటారు. దర్భ చాప అందుబాటులో లేకపోతే, కనీసం కొన్ని దర్భపుల్లలనైనా వాడాలి. అలా చేసినందున  దుష్టశక్తులు ధ్యాన సమయంలో సమీపానికి రావనివిశ్వాసం. అభిషేకంలో, యజ్జం చేసే టపుడు, వివాహ సమయంలో కూడా దర్బలను రకరకాల రూపంలో వాడతారు.

1

దర్భలను సంస్కృతంలో కుశ అనిపిలుస్తారు. దర్భపోచలు చాలా పదునుగా ఉంటాయి. అందుకే చలాకైన వాడిని  కుశాగ్రబుద్ధితోఉన్నాడని చెబుతారు.
గ్రహణ సమయంలో దేవతల విగ్రహాలమీద, నిల్వవుండే ఆహార పదార్థాలమీద దర్భ  పుల్లలు వేస్తే వాటిమీద గ్రహణ ప్రభావం ఉండదని చెబుతారు.

కొన్ని పూజకార్యక్రమాలకుపూనుకునే ముందు మానసిక, ఆధ్యాత్మకి స్వచ్ఛత అవసరం. ఇది దర్భ పవిత్రమ్  లేద దర్భ గడ్డిని వాడటం వల్ల వస్తుందని చెబుతారు.
దీనికోసం తిరుమల బ్రహ్మోత్సవాలలో కూడా ఈ లక్ష్యంతోనే దర్భ పవిత్రమ్ ను వినియోగిస్తారు.  దీనికోసం  టిటిడి అటవీ విభాగం  ఉత్సవాలకు అసవరమయిన పవిత్రమైన దర్భను సిద్ధం చేస్తుంది. దర్భతో తయారుచేసిన చాప, తాడును  అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ అధికారకుల  అందచేస్తారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది.

ఇలాంటి దర్భను తిరుపతి సమీపంలోని వ‌డ‌మా‌ల‌పేట‌  పొలాల గట్ల నుండి సేకరిస్తారు. ఈ దర్భను అక్కడి నుంచి తెచ్చాక  15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 5.5 మీటర్లు  పొడవు, 2 మీటర్ల వెడ‌ల్పు చాపను, 175 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.ఈ నెల 19న జరిగే ధ్వజారోహణలో వీటిని ఉపయోగిస్తారు.

 

ఈ స్టోరీ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి