కథల కొలను ‘కలువ కొలను’ ఇక లేరు!

( రాఘవ శర్మ)
ప్రముఖ కథా రచయిత కలువకొలను సదానంద ( 81) గారు మంగళ వారం ఉదయం పదకొండు గంటలకు కన్ను మూసారు. వీరు 1939 ఫిబ్రవరి 22 వా తేదీన ఏ చిత్తూరు జిల్లా పాకాల లో అయితే జన్మించా రో, అదే పాకాలలో చివరి శ్వాస విడిచారు.

సదానంద గారి ఇద్దరు కుమారులు కరోనా కు చికిత్సలో ఉండగా వీరు ఈ లోకాన్ని వీడడం మరింత విషాదం. వీరు కథ లు, నవలలు, కవిత్వం, గేయాలు రాశారు. రచయిత గానే కాకుండా చిత్ర కారుడిగా, కార్టూనిస్టు గా కూడా తెలుగు ప్రజలకు వీరు పరిచయం. రక్త యజ్ఞం, పైరు గాలి, నవ్వే పెదవులు ఏ డ్చే కళ్ళు మొదలైనవి వీరి కథా సంపుటాలు. గాడిద బ్రతుకులు, గందరగోళం, బంగారు మామ వంటి నవలలు రాసారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1992 లో ఉత్తమ ఉపాధ్యాయుడుగా సత్కారాన్ని పొందారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ సత్కారాన్నీ కూడా పొందారు.

ఎవరికోసం చెపుతున్నా రో వారి చెంత కే వెళ్లి చెబుతున్న ట్టు ఉంటుంది వీరి శైలీ.
వీరు పిల్లల పదాలు రాసినా, గేయాలు రాసినా, కథలు, నవలలు రాసినా, కవితలు అల్లినా, ఎవరికోసం చెపుతున్నా రో వారి చెంత కే వెళ్లి చెబుతున్నట్టు ఉంటుంది. శబ్దాలను శక్తి బాణాలు గా ఉపయోగించి నట్టు ఉంటుంది. వీరిలో కపటం ఉండదు, మొహమాటం ఉండదు, మినహాయింపులు ఉండవు.
చెప్ప దలుచుకున్నది వీలైనంత వినయంగా, కళాత్మకంగా చెపుతారు.
వీరు తెలుగు సాహిత్యానికి చేసిన కృషి ఎంతో ఉత్తేజిత కర మైనది, ప్రగతి చైతన్య మైనది, వాస్తవిక మైనడి. రచయితగా తన నిజాయితీని, స్వేచ్ఛను నిలుపుకున్న వ్యక్తి. వాడటవిక తను వ్యక్తీక రించడం లో వ్యంగం ఆయన ప్రత్యేకత.
రాయల సీమ నుంచి వచ్చిన తొలితరం రచయితల్లో శిల్ప స్పృహతో వీరు చక్కని రచనలు చేశారు.

 

(రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)