రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి జర్నలిస్టు కెఆర్ మూర్తి రాజీనామా

 ప్రముఖ జర్నలిస్ట్ కె.రామచంద్ర మూర్తి ఈ రోజు  జగన్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా సమర్పించారు.
సచివాలయంలో ప్రధాన సలహాదారు అజయ కల్లంను కలుసుకుని తన రాజీనామాను అందజేశారు.
కెఆర్  మూర్తి గతంలో ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు దినపత్రికలకు సంపాదకుడు మరియు సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ గా చేశారు.
హైదరాబాద్ మీడియా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్,  తెలుగు న్యూస్ ఛానల్ అయిన హెచ్‌ఎమ్‌ టివి వ్యవస్థాపక-చీఫ్ ఎడిటర్ మరియు ఇంగ్లీష్ దినపత్రిక ది హన్స్ ఇండియా లో కూడా చేశారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయనని నియమించారు.
సలహాదారుగా నియమించినా చేయాల్సిన పనేమిటో డిఫైన్ చేయకపోయినా చాలా మంది అలాగే కొనసాగుతున్నారు. ఈ సలహాదారులకు జీతాలు తీసుకోవడం  మినహా మరొక పనిలేదు. చాలా మంది సలహదారులకు ముఖ్యమంత్రి దర్శనమీయడం లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఖాతరు చేయక, సంబంధిత శాఖ కార్యదర్శి కలవడానికి ఇష్టపడక చాలా మంది సలహాదారులు దిక్కుతోచక కొనసాగుతున్నారని విపడుతూ ఉంది.
నిజానికి మూర్తికి, మరొక సలహాదారుకు మీరు అమరావతి రానవసంరలేదని హైదరాబాద్ లో ఉండండి చాలని ముఖ్యమంత్రి స్వయంగా ఎపుడో చెప్పారని దానితో ఆయన చాలా ఆవేదన చెందారని మిడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే, పరిస్థితి మెరుగుపడుతుందని, తన సలహాలు ప్రభుత్వానికి అవరమవుతాయని మూర్తి భావిస్తూనే వచ్చారు.
అయితే, కోవిడ్ కారణాల వల్ల సలహాదారులందరిని తీసేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త కూడా అమరావతిలో హల్ చల్ చేస్తూ ఉంది. ఇవన్నీ మూర్తి దాకా వచ్చి ఉండవచ్చు.
 ఈ నేపథ్యంలోనే   మూర్తి  రాజీనాామా చేశారని అనుకుంటున్నారు. కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేరు. అయితే, ఆయన రాజీనామా చేస్తారని అయిదారు నెలలుగా వినబడూ ఉంది. ఇపపుడుది నిజమయింది. మరొక జర్నలిస్టు సలహాదారు కూడా తొందర్లోనే రాజీనామాచేస్తారని వినబడుతూ ఉంది. కొంతమంది మాజీ ఐఎఎస్ సలహాదారులకు కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
తెలంగాణలో కూడా సలహాదారుల పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు.  వీరిని సలహాలెవరూ అడగడం లేదని, ఇచ్చినా  వీరి సలహా తీసుకునేందుకు ప్రభుత్వంలొ ఎవరూసిద్ధంగా లేనందున చాలా మంది సలహాదారులు ఏమి చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారని చర్చనీయాంశమయింది.