ప్రొఫెసర్ ఐలయ్య ఆధునిక మనువు ఎలా అయ్యారు?

(దండి వెంకట్)
పనిలో పనిగా తెలంగాణ సాయుధ పోరాటంపై దాడికి
డాక్టర్ అంబేడ్కర్ గారిని కూడా బాధ్యుడిని చేసే కొత్త కుట్రకు
తెరలేపారు ప్రగతిశీల ముసుగు వీరులు. వెయ్యి మంది రాఘవ శర్మలొచ్చినా సైద్ధాంతిక సమాధానం చెప్పడానికి ఒక్క ఫూలే-అంబెడ్కర్ గ్రామ శాఖ సంఘానికి సరిపోలేరు.
మోదీ రాముడు..అందరి వాడు! అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ఆగస్టు14-2020న ఒక వ్యాసం రాశారు
దీంతో ఐలయ్య గారిని ఆధునిక మనువు ఐలయ్య అంటూ
ప్రగతిశీల ముసుగు ఆధిపత్యవాదుల వారసులైన
రాఘవ శర్మ  తమ ప్రగతిశీల మూస ముసుగు చింపేసుకోని 84 వేల సిద్ధార్థుడి ప్రతిమలను నేలకూల్చిన ఆదిశంకారచారుడిలా మనువు తాండవం చేయడం ప్రారంభించారు. వర్గ వాదుల్లో కొందరు ఎంతటి కుట్రవాదులో ఉద్యమాల ఉపాధ్యాయులు కామ్రేడ్ ఉసా మరణాంతరం ఆయనపై, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిపై చేస్తున్న సైద్ధాంతిక దాడితో వారి కుల కుట్ర బుద్ధి బట్టబయలైపోయింది.అయ్యోధ్యలో భూమి పూజ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఉపన్యాసాన్ని
ప్రొఫెసర్ ఐలయ్య గారు విశ్లేషణ చేశారు తప్పితే మోదీజీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ విధానాన్ని సమర్ధించలేదు.
గతంలో ఎల్ కే అద్వానీ, ఆర్ఎస్ఎస్ లు అనుసరించి విధానాలకు ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాత్రమే ఐలయ్య గారు తన అవగాహన పరిదిలో విశ్లేషణ చేశారు ఒకవేళ ఐలయ్య విశ్లేషణలో ఏ పాయింట్ తప్పో, చెప్పే రైట్ ఎవరికైనా ఉంటుంది. కానీ ఏకంగా ఐలయ్య గారిని ఆధునిక మనువుతో పోల్చడం ఆధిపత్యవాదుల ఖండకావరానికి నిదర్శనమని చెప్పకతప్పదు.

ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆధునిక మనువులాగా ప్రవర్తిస్తున్నారని రచయిత రాఘవశర్మ రాసిన వ్యాసానికి ఇది స్పందన

ప్రస్తుతం భారత దేశంలో శూద్రుకులాల్లో అత్యంత ప్రతిభగల
బహుజన తత్వవేత్త అయిన ప్రొఫెసర్ ఐలయ్య గారిని ఆధునిక మనువు అనడమే కాకుండా ప్రపంచ విప్లవాల చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిల్చిపోయిన తెలంగాణ సాయుధ పోరాటంపై దాడి చేసి నాలుగు వేల మంది అమరుల రక్తతర్పణకు డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్ ను భాధ్యులను చేయడానికి చేసిన దుర్మార్గపు నీతిమాలిన చర్యలను బహుజన సమాజం సహించబోదని ఈ సందర్భంగా వర్గ ఉద్యమంలో ఆధిపత్యవాదులను హెచ్చరించిస్తున్నాము.
రాఘవ శర్మ ఈ క్రింద విధంగా పేర్కొన్నారు
“1947 నుంచి 1951వరకు గల కేంద్ర మంత్రి వర్గంలో
డాక్టర్ అంబేడ్కర్ కూడా సభ్యులుగా ఉన్నారు.వారు సభ్యులుగా ఉన్న మంత్రి వర్గమే భూమి కోసం పోరాడిన ప్రజలను తెలంగాణా లోనూ, ఆంధ్ర లోనూ కాల్చి చంపింది. అక్కడే కాదు, దేశమంతా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో చాలా మంది ప్రజలు, ముఖ్యంగా నిమ్న జాతుల వారు కూడా మరణించారు. అంతే కాదు భారత పార్లమెంట్ లో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అంబేద్కర్  కుల తత్వవాదిగా,పాలక వర్గాల ఏజెంట్ గా పేర్కొన్నారు.”
కమ్యూనిస్టు ఉద్యమంలో ఆధిపత్య కులాల్లో పుట్టినవారి త్యాగాలను ఎవరు విస్మరించలేరు. అదే సందర్భంగా బహుజనులు నాయకత్వ స్థానాల్లోకి ఎందుకు రాలేదో అనేది నేటి ప్రశ్న.
కామ్రేడ్స్: మారోజు, ఉసా , ఓంకార్ ల నుండి ప్రొఫెసర్ కంచె ఐలయ్య లవరకు వేస్తున్న ప్రశ్నలు బిసి అస్థిత్వం నుండి ఎదురవుతున్న ప్రశ్నలవి.
60%మున్న ఉత్పత్తి కులాల అస్థిత్వం నుండి వస్తున్న సామాజిక తిరుగుబాటుకు ప్రతిబింబమే ప్రొఫెసర్ ఐలయ్య గారి ధిక్కారోద్యమం.
దళిత,గిరిజన మైనారిటీలనుండి అత్యంత ఆదరభిమానాలు పొందిన బిసి మేధావుల్లో ఐలయ్యగారు ప్రథములేకాదు, అమెరికా పార్లమెంట్ సైతం
ఆధునిక అంబేద్కర్ తో ఐలయ్యని పోల్చినప్పుడు భారతీయ బహుజనులు
గర్వించదగ్గ విషయమే అవుతుంది.
★ రాఘవ శర్మ మరో ప్రస్తావన ఏమిటంటే దళితులు కృష్ణశాస్త్రీ పేరు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మరి అదే అగ్రహారాల్లో శంభూకుడి
పేరు, జాంబవంతుడి పేరు పోనీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టుకోలేదో తన వ్యాసంలో ప్రస్తావిస్తే బాగుండేదికదా.
డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్ చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడు ఎన్నటికి ఈ దేశంలో విప్లవకారుడు కాలేడని ఈ రాఘవ శర్మ శాపనార్థాలు చూస్తే అర్థమవుతుంది.
ఈ క్రింద చూడండి
బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత ఒక యుగ భ్రమ.
ఈ ఐక్యతకు ఎలాంటి ప్రాతిపదికా లేదు.వీళ్ళ మధ్య విపరీతమైన వైరుధ్యాలు ఉన్నాయి. వీరిది బూర్జువా నినాదం కాదు. ఫ్యూడల్ నినాదం.
ఇది పునరుద్ధరణ వాద విషం. చారిత్రక అసందర్భ శక్తుల క్షీణ గానం. ”
– త్రిపురనేని మధుసూదన రావు ( సాహితీ సర్వస్వం నుంచి )
★ అంటే మనకు అర్థమవుతుంది కదా. గౌతమ బుద్ధుడి జ్ఞాన చరిత్ర ధ్వంసం చేసిన విదేశీ ఆర్యులు ఏవిధంగానైతే ఈదేశ మూలభారతీయులు ఐక్యతను సాధించకుండా కుట్రలు చేశారో తెలిసిపోయింది. ఇది కేవలం బహుజనులకు రాఘవ శర్మ రూపంలో కనిపించే రోతపూరితమైన రాతలే కావచ్చు కానీ ఇదేశ బహుజనుల అస్థిత్వాన్నే ధ్వంసం చేసే కుట్రరాతలు మాత్రమే. ప్రగతిశీల ముసుగులో దాగియున్న దడికట్టుకున్న మడివాదం. బహుజనులను ఇంతకాలం మోసపూరితంగా రాజకీయ బానిసత్వంలోకి నెట్టబడ్డ నయా మనువాద ముసుగులో దాగివున్న అభివృద్ధినిరోధక శక్తులకు,
ఉత్పత్తి శక్తులైన బహుజనుల మద్య ఉన్న విభజన గీత స్పష్టంగా కనిపిస్తోంది.
Dandi Venkat
(దండి వెంకట్, కన్వీనర్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్
తెలంగాణ రాష్ట్ర కమిటీ)
16-8-2020, హోమ్ క్వారంటైన్ నిజామాబాద్ నుండి.