(దండి వెంకట్)
పనిలో పనిగా తెలంగాణ సాయుధ పోరాటంపై దాడికి
డాక్టర్ అంబేడ్కర్ గారిని కూడా బాధ్యుడిని చేసే కొత్త కుట్రకు
తెరలేపారు ప్రగతిశీల ముసుగు వీరులు. వెయ్యి మంది రాఘవ శర్మలొచ్చినా సైద్ధాంతిక సమాధానం చెప్పడానికి ఒక్క ఫూలే-అంబెడ్కర్ గ్రామ శాఖ సంఘానికి సరిపోలేరు.
మోదీ రాముడు..అందరి వాడు! అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ఆగస్టు14-2020న ఒక వ్యాసం రాశారు
దీంతో ఐలయ్య గారిని ఆధునిక మనువు ఐలయ్య అంటూ
ప్రగతిశీల ముసుగు ఆధిపత్యవాదుల వారసులైన
రాఘవ శర్మ తమ ప్రగతిశీల మూస ముసుగు చింపేసుకోని 84 వేల సిద్ధార్థుడి ప్రతిమలను నేలకూల్చిన ఆదిశంకారచారుడిలా మనువు తాండవం చేయడం ప్రారంభించారు. వర్గ వాదుల్లో కొందరు ఎంతటి కుట్రవాదులో ఉద్యమాల ఉపాధ్యాయులు కామ్రేడ్ ఉసా మరణాంతరం ఆయనపై, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిపై చేస్తున్న సైద్ధాంతిక దాడితో వారి కుల కుట్ర బుద్ధి బట్టబయలైపోయింది.అయ్యోధ్యలో భూమి పూజ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఉపన్యాసాన్ని
ప్రొఫెసర్ ఐలయ్య గారు విశ్లేషణ చేశారు తప్పితే మోదీజీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ విధానాన్ని సమర్ధించలేదు.
గతంలో ఎల్ కే అద్వానీ, ఆర్ఎస్ఎస్ లు అనుసరించి విధానాలకు ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాత్రమే ఐలయ్య గారు తన అవగాహన పరిదిలో విశ్లేషణ చేశారు ఒకవేళ ఐలయ్య విశ్లేషణలో ఏ పాయింట్ తప్పో, చెప్పే రైట్ ఎవరికైనా ఉంటుంది. కానీ ఏకంగా ఐలయ్య గారిని ఆధునిక మనువుతో పోల్చడం ఆధిపత్యవాదుల ఖండకావరానికి నిదర్శనమని చెప్పకతప్పదు.
ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆధునిక మనువులాగా ప్రవర్తిస్తున్నారని రచయిత రాఘవశర్మ రాసిన వ్యాసానికి ఇది స్పందన