నిర్మ‌ల్ లో రెపరెపలాడిన 150 అ. జెండా: ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్

నిర్మ‌ల్, ఆగ‌స్టు 15:  నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో భారీ జాతీయ ప‌తాకాన్ని ఎగరేశారు. ఈరోజు 74 వ  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 150 అడుగుల  భారీ మువ్వ‌న్నెల జెండాను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.
‌ ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు.
14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.53 లక్షల వ్య‌యంతో జాతీయ పతాకం ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో అతి ఎత్తైన జెండాల్లో ఇది ఒక్క‌టి. ఈ భారీ జాతీయ జెండాను ముంబైకి చెందిన బజాజ్‌ కంపెనీ రూపొందించింది. 32 అడుగుల పొడవు, 48 ఫీట్ల వెడల్పుతో త్రివర్ణ పతాకాన్ని ముంబైలో తయారు చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కె. విజ‌య‌ల‌క్ష్మి, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ అలీ, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో నిర్మ‌ల్ పట్టణం కొత్త పుంతలు తొక్కుతున్నది. మెట్రో నగరాలకు దీటుగా అన్ని హంగులతో ముస్తాబవుతోంది. సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగరాలు, ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ది ప‌రిచేందుకు నిధులను కేటాయించడంతో ప్రణాళిక బద్దంగా అభివృద్ది పనులు సాగుతున్నాయి. జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్ గా, సుందరంగా తీర్చిదిద్దేంద‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఎత్తైన జండా.

 

Like this story? Share it with a friend!