కరోనా విజృంభిస్తుంటే వైన్ షాపుల సమయం పెంచుతారా?: డాక్టర్ మల్లు

ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మద్యం షాప్ లను రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి విస్మయం వ్యక్తం చేశారుు.
ఇధి ప్రభుత్వ మూర్ఖపు చర్య అని విమర్శిస్తూ  కరోనో తీవ్రంగా పెరుగుతున్న సమయంలో వేళలు ఇంకా తగ్గించి ప్రజలెక్కడ గుమికూడా చూాాడాల్సింది పోయి మద్యంషాపులు ఎక్కువ సేపు తెరవాలనుకోవడం చాలా ప్రమాదకరమయిన ధోరణి అని డాక్టర్  మల్లు రవి వ్యాఖ్యానించారు.
గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ  ప్రభుత్వానికి ప్రజారోగ్యం కన్నా ప్రభుత్వాదాయం మీద మక్కువ ఎక్కువ అని చెప్పేందుకు ఇంతకుమించి మంచి ఉదాహరణ ఏముంటుందని ఆయన అన్నారు.
మల్లు రవి ఇంకా ఏమన్నారంటే…
 ఎక్సైజ్ మంత్రి రాష్ట్రంలో గుడుంబా విస్తరిస్తున్న నేపధ్యంలో వైన్స్ సమయాన్ని రాత్రి 9.30 గంటల వరకు పెంచాలని నిర్ణయించామని చెప్పడం వింతగా ఉంది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇలాంటి సాకులు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు.
గతంలో సాయంత్రం 6 గంటల వరకు 8 గంటల వరకు తెరిచారు. ఇప్పుడు 9.30 వరకు పెంచాలని నిర్ణయించారు.  ఇలా చేస్తే మద్యం ప్రియులు షాప్ ల వద్ద పడిగాపులు కాస్తూంటే గుంపుల తయారవుతాయి.  కరోనా విస్తరించేందుకు ఇలాంటి గుంపులే కారణం. ఇది  ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం..
ఒకవైపు వైద్య శాఖ కరోనాని అరికట్టాలంటే మరోసారి లక్డౌన్ చేయాలని సూచిస్తున్నది.  ప్రభుత్వమే ఎలాంటి హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. కరోనా వ్యాప్తికి దోహదపడే విధంగా వైన్స్ సమయాలు పెంచడం ఏమిటి?  సాధ్యమైనంత తక్కువ సమయం తెరిచి ఎక్కువ సమయం మూసేలా చూడాలనేదే లాక్ డౌన్ లాజిక్ . లాక్ డౌన్ విధించడం లోని రహస్యం ప్రజలెవరూ ఇల్లొదలి బయటకురాకూడదనే. కాని తెలంగాణప్రభుత్వం కాసులమీద కక్కర్తితో ప్రజలు ఎక్కవసేపు రోడ్ల మీద గడి పే పరిస్థితి సృష్టించి ప్రమాదకరమయిన వాతావరణంలోకి ప్రజలను నెడుతూ ఉంది.
ఎంతో కట్టదిట్టంగా ఉంటున్న కరోనా శాసన సభ్యలును కూడా వదలడం లేదు. సీనియర్ అధికారులను వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలో తీసుకుంటున్న డాక్టర్లను కరోనా వదలడం లేదు.ఇలాంటపుడు వైన్ షాపుల టైమింగ్  పెంచి సాధారణ ప్రజలు ఎక్కవుసేపు బయట రోడ్ల మీద గడిపే స్థితి తీసుకురావడం ప్రమాదం కరం. ఇది వారినేకాదు, కుటుంబ సభ్యులను కూడా కరోనా దగ్గిరకు తోసేడమే కాదా? ఈ నిర్ణయం కుటుంబాలకుఎంత ప్రమాదంగా పరిణమిస్తున్నదో  ప్రభుత్వం గమనించాలి.
రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి కరోనా పట్ల, వ్యాప్తి చెందే తీరు పట్ల, కరోనా పరీక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీనిఫలితంగానే ఇపుడు కరోనా కేసులు తీవ్రంగా పెరిగి, ప్రజలుభయపడే పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ ఆంక్షలను సడలించినా  వ్యాపార వాణిజ్యాలు పెరగకపోవడానికి కారణమ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణియే కారణం. ప్రభుత్వంలోని పెద్దలు  రాజకీయాలతో కాకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యరం నిపుణుల సలహా  ప్రకారం నిర్ణయాలుతీసుకోవాలి.