గం. 360 కిమీ స్పీడ్… బుల్లెట్ ట్రెయిన్స్ లో జపాన్ మరొక రికార్డు

బుల్లెట్ ట్రెయిన్స్ లో జపాన్ మరొక రికార్డు బద్దలుకొట్టింది. సూపర్ ఫాస్ట్ గా వెళ్లడమేకాదు,ఎలాంటి కుదుపుల్లేకుండా అనకొండలా పాకుతూ స్మూత్ గా దూసుకుపోయే  ట్రెయిన్ జూలై ఒకటో తేదీన ప్రారంభించింది.
భూకంపం వచ్చినా కూడా చెక్కుచెదరకుండా ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లేవిధంగా తయారు చేసిన ఈ అద్భతమయిన రైలు పేరు N700S. భూకంపం వచ్చినా, పవర్ పోయినా ఈ రైలు తక్కువ స్పీడుతో ప్రయాణించేందుకువీలుగా లిధియమ్ అయాన్ సెల్ఫ్ ప్రొపల్స్ న్ బ్యాటరీ సిస్టమ్ ఉంది. అంటే ఈ రైలు క్యాటనరీ కనెక్షన్  (catenary-free) అవసరం లేకుండా నడుస్తుందన్నమాట.  రైలు పైన వుండే విద్యుత్ లైన్లనే క్యాటనరీ లైన్లు అంటారు.   రైలుకు 16 బోగీలుంటాయి.
Photo credits twitter@Asaka_38b
టోక్యో స్టేషన్ నుంచి షిన్-ఒసాకా దాకా ఈ ట్రెయిన్ నడుస్తుంది.  పరీక్షల సమయంలో దీని స్పీడు గంటకు 360 కిమీదాకావెళ్లింది. అయితే, కమర్షియల్ ఆపరేషన్ లో  ఈ స్పీడ్ ను 285 కి.మీ దగ్గిర ఆపేస్తారు. ఇది సెంట్రల్ జపాన్ రైల్వేకి చెందిన రైలు. పదమూడు సంవత్సరాల తర్వాత ఈ రైల్వే మొదటి బుల్లెట్ ట్రెయిన్ ను ప్రవేశపెట్టింది.ఆ తర్వాత ఇదే.
ఈరైలుని హితాచి, తోషిబా, మిత్సుబిషి, ఫుజి ఎలెక్ట్రిక్ అన్ని కలసి తయారు చేశాయి. ఈ ఏడాది 12 రైళ్లను ప్రవేశపెడతారు. 2021లో పద్నాలుగు రైళ్లు, 2022 లో మరొక పద్నాలుగు రైళ్లు ప్రవేశపెడతారు.
2020 ఒలింపిక్స్  సందర్భంగా ఈ రైలును ప్రారంభించాలనుకున్నారు. అయితే, కోవిడ్ కారణంగా ఒలింపిక్స్ 2021కి వాయిదా పడటంతో ఇపుడే ప్రారంభించారు.
ఈ మార్గంలో మొదటి బుల్లెట్ ట్రెయిన్ 1964లో వచ్చింది. అపుడుకూడా  టోక్యో – ఒసాకాల మధ్య నే అప్పటి సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా ప్రారంభించారు. అపుడుకూడా అదే ప్రపంచంలోని మొట్టమొదటి హై స్పీడ్ లైన్. ప్రయాణికులు సౌకర్యవంతంగా కాళ్లు చాపుకునేందుకు వీలైన సీట్లు ఈ రైలు ప్రత్యేకత . రైలు లోపల లైటింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.రైలు కుదుపులీయకపోవడమే కాదు, నిశబ్దంగా కూడా ఉంటుంది.