కారు చౌకగా మద్రాస్ ఐఐటి బిఎస్ సి ఆన్ లైన్ కోర్సు

కాలేజీ ఫీజులు వేల నుంచి లక్షల్లోకి వెళ్లిపోయిన ఈ రోజులు కేవలం రు. 3 వేలకే మద్రాస్ ఐఐటి (IIT-M) బిఎస్ సి కంప్యూటర్ సైన్స్ ఆన్ లైన్ కోర్సును ప్రారంభిచింది.  ప్రోగ్రామింగ్ , డేటాసైన్స్ లో ఈకోర్సు ఉంటుంది.
ఇంటర్ లేదా 12 వ తరగతి పాసయిన వారెవరైనా ఈ అన్ లైన్ కోర్సులో  చేరవచ్చు. కాకపోతే  మెట్రిక్  లో ఇంగ్లీష్, మాథ్స్ చదివి ఉండాలి. ఇతర ఢిగ్రీ కోర్సులలో, ప్రొఫెషన్ కోర్సులలో చేరిన వారితో సహా ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ ఆన్ లైన్ బిఎస్ సిలో చేరవచ్చు.
ఈ కోర్సును కేంద్ర మానవ వనరుల శాఖసహాయంతో నిర్వహిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ బిఎస్సి కోర్స్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి విద్యాసంస్థ అయింది మద్రాస్ ఐఐటి. ఈ కోర్సు మూడు రకాలుగా అంటే ఫౌండేషన్, డిప్లొమా, డిగ్రీలు గా లభిస్తుంది. ఒకటి, రెండు, మూడు సంవత్సరాలల్ ఈ కోర్సును పూర్తి చేయవచ్చు.ఫీజు కారు చౌక రు. 3,000 మాత్రమే.
 దేశంలోనే కాదు, ప్రపంచమంతా డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతూ ఉంది, భారతదేశంలోపారిశ్రామికాభివృద్ధికి కూడా ఇది బాగా దోహదపడుతుంది. మేం చాలా ఉత్తమోత్తమ విద్యను అందిస్తామని మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర రామమూర్తి చెప్పారు. జూన్ 30న ఈ కోర్సును  కేంద్ర హెచ్ ఆర్ డి మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ ప్రారంభించారు.
ఈ కోర్సులో విద్యార్థులకు మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్ కంప్యూటేషన్ థింకింగ్  లలో అన్ లైన్ స్టడీమెటిరియల్ ని నాలుగు వారాలలో అందిస్తారని,  ఆ తర్వాత వారుఎంట్రన్స్ రాయవచ్చని , ఇందులో 50 శాతం మార్కులొచ్చిన వారందరికి ఈ ఆన్ లైన్ కోర్సులో ప్రవేశం లభిస్తుందని మంత్రి పోక్రియాల్ చెప్పారు.