తెలంగాణలో ఈ రోజు కొత్త కేసులు 206, మరొక రికార్డు

ఆల్ ఇండియా కేసుల్లా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు సృష్టిస్తున్నారు. రోజూ తగ్గిందే లేదు, పెరగడమే. మరొక వైపు తెలంగాణ పూర్తిగా తెరుచుకుంటున్నది. బార్లు పబ్బులు కూడా తెరుచుకుంటున్నాయి.  ఇటువైపు  నేేనేం తక్కువా అన్నట్లు కరోనా  కేసులు బయటపడుతున్నాయి.
రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  ఈ రాత్రి విడుదల చేసిన బులెటీన్ లో తెలంగాణ ఆరోగ్య ప్రజలను హెచ్చరించింది.
It is observed that there is a surge of cases in most of the districts across the state. In view of the surge the public is requested to be alert and self vigilant for any signs
and symptoms of Influenza Like Illness (ILI) OR Severe Acute Respiratory Infection (SARI) అని బులెటీన్ లో ఆరోగ్య శాఖ పేర్కొంది.
గత 24 గంటలలో అంటేనిన్న సాయంకాలం 5 గం. నుంచి ఈ రోజు 5 గం దాకా 206 కేసులు బయటపడ్డాయి. ఇందులో జిహెచ్ ఎంసి ఏరియా నుంచచే 152 కేసులు నమోదయ్యాయి.ఇవ్వాళ 10మంది మృతి చెందారు.
గత 24 గంటలలోనమోదయిన కేసులన్నీ స్థానికులనుంచి వచ్చినవే. నగరంలో లేదా రాష్ట్రంలో ఉన్న వలసకూలీల నుంచి వచ్చిన కేసులేమీ లేవు. అన్నీ తెలంగాణ సొంతసరకే. గతంలో  వలస వచ్చిన వారిలో కనిపించిన కేసులు 448. అవి మాత్రమే ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో నమోదయిన మొత్తం పాజిటిివ్ కేసులు3496. ఇంతవరకు డిశ్చార్జ్అయిన వారు 1710.  చనిపోయిన వారు 123 మంది. ఇపుడు ఆసుపత్రులలో చికిత్స పొొందుతున్నవారు (యాక్టివ్ కేసులు)1663.
ఈ రోజు నమోదయిన కేసులలో  రంగారెడ్డి నుంచి 10, మేడ్చల్ నుంచి 18, నిర్మల్ నుంచి 5, యాదాాద్రి నుంచి 5,మహబూబ్ నగర్ నుంచి4, వికారాబాద్, నాగర్ కర్నూల్,జగిత్యాల్ ల నుంచి రేండేసి,గద్వాల్,నల్గొండ, బద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల్,మహబూబాద్ లనుంచి ఒకటేసి ఉన్నాయి.
పాటించాల్సిన జాగ్రత్తలు:
*In case of the onset of any symptoms of ILI OR SARI, the public are requested to immediately contact the nearest government health facility without any delay.
* The public is requested to avoid self-medication, quacks, faith healers, and any other indigenous therapy.
* Early reporting to the health facility will enable prompt diagnosis and management.
*Seeking medical care soon after the onset of symptoms is vital to reduce the
morbidity and mortality associated with Covid-19.
* Do not step out of the house unless essential.