బోనాలు ఉండాలి, కరోనా హైదరాబాద్ కు అమ్మవారు అండ కావాలి: కాంగ్రెస్

కోవిద్ నిబంధనలకు లోబడి బోనాల పండుగను జరుపుకోవడానికి ప్రభుత్వము దేవాలయ కమిటీలను అనుమతించాలని, బోనాల పండగ మీద ఆంక్షలు వద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి  నిరంజన్ గోపిశెట్టి  తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
లాక్ డౌన్ నిబంధనలున్నా కొండపోచమ్మ జలాశయానికి నీటి విడుదలకు ముందు సి.ఎమ్ కె.సి.ఆర్ గ కొండ పోచమ్మ తల్లి దర్శనము, చండీ యాగము, సుదర్శన యాగము ఏ ఉద్దేశంతో  జరిపించారో అదే ఉద్దేశంలో బోనాలు జరిపించేందుకు అనుమతినీయాలని ఆయన కోరారు.
హైదరాబాద్ లో బోనాల పండుగ ఉండకపోవచ్చని దేవాదాయ శాఖా మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి చేసిన ప్రకటనకు నిరంజన్ స్పందించారు.
బోనాల పండుగ జరుగుతదా లేదా అనే సంశయాలకు తావిచ్చి ప్రజలను ఆందోళనలకు గురి చేయవద్దని ఆయన ఒక ప్రకటనలో దేేవాదాయ మంత్రికి విజ్జప్తి చేశారు.
జి.నిరంజన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు: 
అమ్మవారు శక్తి మాతా. సర్వ జగద్రక్షకురాలు. తమ కుటుంబముతో పాటు యావత్ మానవాళిని రక్షించమని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరము ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ఇందులో ప్రజల శ్రేయస్సు ప్రభుత్వాల శ్రేయస్సు ఇమిడి ఉన్నది.ఆటంకాలు కల్పించ వద్దు.
లాక్ డౌన్ నిబంధనలున్నా కొండపోచమ్మ జలాశయానికి నీటి విడుదలకు ముందు సి.ఎమ్ కె.సి.ఆర్ గారు కొండ పోచమ్మ తల్లి దర్శనము, చండీ యాగము, సుదర్శన యాగము జరిపించడములోని ఉద్దేశ్యాలను గమనించి, వాడ వాడలా జరిగే బోనాల పండుగ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించమని అమ్మవారిని ప్రార్థించటానికేనని గుర్తించాలి.
కరోనా బారి నుండి రక్షించడములో వ్యవస్థలు విఫలమౌతున్న దశలో అమ్మవారి శరణులో కెళ్లడానికి బోనాల రూపములో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవాలి.
*బోనాల సందర్భములో అమ్మ వారికి జరిగే పూజలు
యధావిధిగా పరిమిత సంఖ్య భక్తులతో భౌతిక దూరాన్ని
పాటిస్తూ జరగాలి.
*జూన్ 25న గోల్కొండ ఊరేగింపు, జులై 13 న ఉజ్జయిని
మహాంకాళి ఊరేగింపు, జులై 19న సబ్జిమండి ఊరేగింపు,
జులై 20న జరిగే పాత బస్తీ ఊరేగింపులు ఆయా మందిర
కమిటీ సభ్యులతో మాత్రమే జరుపుకునే విధముగా
అనుమతివ్వాలి.
*సంప్రదాయము ప్రకారము శ్రీ ఉజ్జయిని మహంకాళి మందిరము, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరము, సబ్జిమండి నల్ల పోచమ్మ మందిరము ఊరేగింపులో పాల్గొనటానికి ఏనుగును ఏర్పాటు చేయాలి.
*ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఏర్పాటు చేసే
సాంస్కృతిక కార్య క్రమాలను ఈ సారి రద్దు చేయవచ్చు.
*పరిమిత సంఖ్యలో భక్తులకు ప్రత్యక్ష దర్శనావకాశము లభించనున్నందున ప్రధాన దేవాలయాలలో జరిగే పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు ప్రత్యక్ష ప్రచారము చేయాలి.
జి.నిరంజన్
అధికార ప్రతినిధి
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ