ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్ గా రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హ రిచందన్ జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
అనంతరం నూతన ఇఆర్‌సి చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జున రెడ్డికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు పుష్ఫగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనీల్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండి నాగుపల్లి శ్రీకాంత్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.