శ్రేయోభిలాషి… రియల్ ఎస్టేట్ సక్సెస్ స్టోరీ (వీడియో)

రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన శ్రేయోభిలాషి డెవలపర్స్ అనతికాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణానికి ఆనుకొని ఉరుమడ్ల, నేరడ రోడ్ల మధ్యలో 9 ఎకరాల విస్తీర్ణంలో సకల ఆధునిక సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ నెలకొల్పింది. కే.ఎన్.ఆర్. ఎన్ క్లేవ్ పేరుతో పచ్చని వాతావరణంలో అవతరించిన ఈ వెంచర్ కొనుగోలుదారుల నమ్మకాన్ని సంపాదించుకున్నది… వారి మనసు గెల్చుకున్నది. చిట్యాల వెంచర్ లో వాటర్ ట్యాంక్, రెండు పార్కులతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని పూర్తిచేసినట్లు సంస్థ మేనేజింగ్ పార్టనర్ ఎన్. అంజయ్య వెల్లడించారు.
చిట్యాల వెంచర్ లో ప్లాట్ తీసుకున్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయోభిలాషి డెవలపర్స్ వారు డెవలప్మెంట్స్ చేసినా… మంచినీటి సమస్య నెలకొందని ఓ ప్లాట్ ఓనర్ తెలిపారు. నీటి సమస్య తీరితే ఇండ్లు కట్టుకుంటామంటున్నారు.
ప్లాట్స్ అమ్మకం పూర్తికాగానే ఓనర్స్ తో సమావేశం పెట్టి కమిటీ ఎన్నుకున్నారు. ఈ వెంచర్ లో ఇప్పటికే 10 మంది ఇండ్లు కట్టుకునేందుకు రెడీ అయ్యారని కమిటీ తొలి సెక్రటరీ మిర్యాల నరేశ్ తెలిపారు. అనతికాలంలో… కే.ఎన్.ఆర్. ఎన్ క్లేవ్ లో అందమైన కాలనీ రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సోషల్ వర్కర్ ఎన్.అంజయ్య మేనేజింగ్ పార్టనర్ గా 15 మంది సామాన్యులతో శ్రేయోభిలాషి డెవలపర్స్ సంస్థ 2016లో ఆవిర్భవించింది. చిట్యాలలో తన తొలి వెంచర్ ను రెండున్నరేళ్ల కాలంలో విజయవంతంగా పూర్తిచేసింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలో ఒక వెంచర్, నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ రోడ్డులోని చింతపల్లి వద్ద మరో వెంచర్ నడుస్తున్నాయి. చింతపల్లిలో అతి త్వరలో ప్లాట్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని సంస్థ ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో వెంచర్ ఆరంభం కానుందని తెలిపింది. కింద వీడియో లింక్ ఉంది చూడండి.