ఐఐటి ఎంటెక్ ఇలా తయారయింది, అందుకే సర్జికల్ స్ట్రయిక్

ఐఐటిలో ఎంటెక్ చదవే విద్యార్థులలో సగం మంది కోర్సును మధ్యలోనే వదిలేసున్నారు. ఎంటెక్ లో డ్రాప్ అవుట్ రేటు 50 శాతం ఉందని ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ వి రామ్ గోపాల్ రావు చెప్పారు.
ఐఐటి ఎంటెక్ ను చాలా మంది విద్యార్తులు స్టాప్ గ్యాప్ గా వాడుకుంటున్నారని, ఉద్యోగం వచ్చేదాకా కాలేజీలో కూర్చుందామని వస్తున్నారని ఆయన చెప్పారు.
వీళ్లంతా ఉద్యోగం రాగానే లేదా ఏదయినా కాంపిటీటివ్ పరీక్ష పాస్ అవగానే ఎంటెక్ వదిలేస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ మధ్య ఎంటెక్ అడ్మిషన్ ఫీజు పెంచడం అయిష్టంగా ఎంటెక్ చేరే వాళ్ల మీద ఒక సర్జికల్ స్ట్రయిక్ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంటెక్ సీట్లకు చాలా డిమాండ్ వుందని, ఇలా మధ్యలోనే వదిలేసే వారి వాళ్ల ఐఐటిలకు, సీటు ఆశిస్తున్నవిద్యార్థులకు చాలా నష్టం జరుగుతూ ఉందని ఆయన చెప్పారు.
ఇలా స్టాప్ గ్యాప్ గా వచ్చే వాళ్లకు ప్రజల డబ్బును చాలా వసతులు ఉచితంగా కల్పిస్తున్నామని చెబుతూ వాళ్లు మధ్యలోనే కోర్సు వదిలేస్తే ఇదంతా వృధాయే కదా అని ఆయన అన్నారు.
ఏదో ఒక ఉద్యోగం వస్తూను ఎంటెక్ వదిలేస్తున్నవారి సంఖ్య 50 శాతం దాకా ఉందని ఆయన చెప్పారు. ఉద్యోగం రాకుండా కోర్సులో ఉన్నవారిలో చాల మంది కూడా కోర్సు పూర్తి చేయాలనుకోవడం లేదని, వాళ్లు కూడా సివిల్స్ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని ఆయన తెలిపారు.
ఐఐటిలలో అడ్మిషన్ పీజు పెంచాలని నిర్ణయం తీసుకున్న 23ఐఐటి ల కౌన్సిల్ లో కూడా రావుసభ్యుడి గా ఉంటున్నారు.
ఎంటెక్ కంటే బిటెక్ ద్వారా ఉద్యోగాలలో పైకి రావచ్చని చాలా మంది డ్రాప్ అవుట్లు భావిస్తున్నారు. కోర్సు పూర్తి చేయాలనే ఉద్దేశమే లేకుండా ఎంటెక్ లో చేరే వాళ్ల మీద టాక్స్ పేయర్ల డబ్బు ఖర్చు ఏలాఖర్చుచేయాలని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా ఆందోళనకరమయిన విషయమని ఆయన అన్నారు.
అందుకే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నాయకత్వంలోని ఐఐటి కౌన్సిల్ ఎంటెక్ ఫీజులు పెంచి బిటెక్ స్థాయికి తీసుకురావాలని నిర్ణయించినట్లు రామ్ గోపాల రావు వెల్లడించారు.