తెలంగాణ సిఎల్ పి రూలింగ్ టిఆర్ ఎస్ లో విలీనం (వీడియో)

తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టిఆర్ ఎస్ లో విలీనం చేయాలని కోరుతూ 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ  ఇచ్చారు.
నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఈ రోజుతాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టిర్ ఎస్ లో చేరడంతో సిఎల్ పి విలీనానికి బాట ఏర్పడింది. దీనితో ఫిరాయింపు దారుల సంఖ్య సిఎల్ పిలో 12 కు చేరింది. వీరంతా మొదట పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటిఆర్ ను కలిశారు.
దీనితో అసెంబ్లీ ఆవరణలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ఎదుట  కాంగ్రెస్  నిరసన ప్రారంభించింది.
అప్రజాస్వామికంగా వీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా అసీంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నల్ల రిబ్బన్ తో నిరసన తెలపాలని భట్టి విక్రమార్క భావించిన అధికారులు అందుకు అనుమతి నిరాకరించడంతో.. వారి గేటుకు ఎదురుగా వారి విగ్రహాల ఎదుట నడిరోడ్డుపై కూర్చుని నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.