ఎపిలో సిబిఐ మీద నిషేధం ఎత్తి వేసిన జగన్…

అమరావతి: రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది నవంబర్ 8 న ఇచ్చిన  తెలుగుదేశం ప్రభుత్వం సిబిఐ ప్రవేశంమీద నిషేధం విధిస్తూ తెచ్చిన  జీవో ను జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ  రోజు  రద్దు చేసింది.

రాష్ట్రంలో తెలుగుదేశం అభిమానుల మీద సిబిఐ దాడులు పెరిగిపోతూ ఉండటంతో   అప్పటి  ముఖ్యమంత్రి చంద్రబాబు అది రాష్ట్ర ప్రభుత్వం మీద, తెలుగుదేశం నేతల మీద కక్ష సాధింపు అని చెబుతూ  సీఎం చంద్రబాబు సిబిఐ మీద నిషేధం విధించారు.

ఐటీ,సీబీఐ దాడులతో పార్టీని ఇబ్బందులు పెడుతున్నారని ఆయన విమర్శిస్తూ వచ్చారు. సిబిఐ ని నిషేదిస్తూ తెచ్చిన G.O.Ms.
No.176,Home(SC.A) కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచింది.

ఆ  జీవోని రద్దు చేసిన జగన్ సర్కార్ రద్దు చేసింది.

తాజా జీవో తో రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐ కి మార్గం సులభమయింది.