సెన్సేషనల్ న్యూస్: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ మృతి

పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరణించినట్లు పాకిస్థాన్ స్థానిక సమాచారం. అయితే ఈ విషయంపై పాక్ మాత్రం అధికారిక ప్రకటన చేయట్లేదు. పుల్వామాదాడి జరిగినప్పటి నుండి పాక్ ప్రభుత్వం భిన్న పోకడలు పోతోంది. ఉగ్రవాద సంస్థల చేతిలో ఉన్న పాక్ ఆర్మీ చెప్పినట్టు నడుస్తోన్న పాక్ ప్రభుత్వం పుల్వామా ఘటన, భారత ఎయిర్ స్ట్రైక్స్, పాక్ జెట్ ఫైటర్స్ రూల్స్ కి వ్యతిరేకంగా భారత్ సరిహద్దులు దాటడం, మన దేశపు ముగ్గురు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని ఇలా పలు ఘటనలపై పాక్ ప్రభుత్వం పరువు కాపాడుకునేందుకు రకరకాల అబద్దాలు చెబుతూ వచ్చింది.

పుల్వామా ఘటనకు పాకిస్థాన్ కు సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించగా, జైషే మహమ్మద్ సంస్థ మేమే చేశామని బహిరంగ ప్రకటన చేసింది. జైషే మహమ్మద్ సంస్థ గురించి తమకి ఆచూకీ తెలియదని పాక్ అంటుండగానే మన ఐఏఎఫ్ వాటి స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 300 మంది ఉగ్రవాదులను ఖతం చేసి విజయం సాధించింది. భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ గురించి బయటకి తెలిస్తే పాక్ పరువు పోతుందనుకుని, ఏమీ జరగనట్టు ఆనవాళ్లు మాయం చేసే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం.

కాగా మసూద్ అజర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత్ పెట్టిన ప్రపోజల్ కి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ఇక మసూద్ ని పట్టుకోవాలని పాక్ పై ప్రపంచదేశాల ఒత్తిడి పెరగడంతో పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి జైషే చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని, అతను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని వెల్లడించారు. అజర్ నడవలేని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని, చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించగా పుల్వామా దాడికి సూత్రధారి అతనే అని భరత్ అధరాలు చూపించాలని, ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

శనివారం మరోసారి స్పందించిన ఖురేషి మసూద్ అజర్ కి పుల్వామా దాడికి ఎటువంటి సంబంధం లేదనడం గమనార్హం. అతనికి డయాలసిస్ జరుగుతోందని తెలిపారు. ఇటు పాక్ స్థానికంగాను, సోషల్ మీడియాలోనూ భరత్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో మసూద్ అజర్ తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆరోగ్యం విషమించడంతో మరణించాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఎయిర్ స్ట్రైక్స్ వలన ఆ దేశంలో ఎవరికీ ఏమీ జరగలేదని బుకాయిస్తున్న పాక్ ఎయిర్ స్ట్రైక్స్ వలనే మసూద్ మరణించాడనే వార్త బయటకి వస్తే పరువు పోతుందని కొత్త డ్రామాకి తెరలేపినట్టు తెలుస్తోంది. అందుకే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని కధలు అల్లుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *