ఈ ఆంధ్రా గ్రామస్థులు గాంధీజీని అమ్మవారు రూపంలో పూజిస్తారు…

మహాత్మా గాంధీని దేవుడిలా పూజించండం గురించి వింటున్నాం.
మొన్నామధ్య తెలంగాణ నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని పెద్ద కప్పర్తి లో మహాత్ముడికి గుడి కట్టారు.
2014లో గాంధీజీ ట్రస్టొకటి కట్టిన ఈ దేవాలయంలో గాంధీజీ విగ్రహం కూడా ప్రతిష్టించారు. నిజానికి గాంధీ విగ్రహారాధనకు దూరం. ఆయన గుళ్లకు వెళ్లి దేవుళ్లకు అభిషేకాలు చేసి, లేదా పూజలు చేసిన సంఘటనలు లేవు.
తన పత్రిక యంగ్ ఇండియాలో చాలా స్పష్టంగా విగ్రహారాధాన తనలో ఎలాంటి ఆద్యాత్మికావేశం తీసుకురావడం లేదని చెప్పారు.
అయితే, విగ్రాహారాధన తప్పేమీ కాదు అని అన్నారు.
“I do not disbelieve in idol worship. An idol does not excite any feeling of veneration in me. But I think that idol worship is part of human nature. We hanker after symbolism. Why should one be more composed in a church than elsewhere? Images are an aid to worship. No Hindu considers an image to be God. I do not consider idol worship a sin.” (YI, 6-10-1921, p318)
 ఇలా విగ్రహారాధానను వదిలేసిన గాంధీజీ గుడిలో దేవుడి విగ్రహం కావడం ఆశ్చర్యం. ఈ మేరకు బాగానే ఉంది. మరి మహాత్మగాంధీని దేవుడిలా కాకుండా దేవత చూడటం ఎపుడైనా విన్నారు.
శ్రీకాకుళం జిల్లా కేదారిపురం ఇదొక సంప్రదాయమయింది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/mahatma-gandhi-visits-to-vijayawada-guntur-and-machilipatnam/

ఈ గ్రామంలో మహాత్ముడిని  స్త్రీ రూపంలో అంటే గ్రామ దేవతలాగా పూజిస్తారు. ప్రతియేటా ఖరీఫ్ సీజన్ లో గాంధీజీని ‘గాంధమ్మ’గా పూజిస్తారు.ఇలా గాంధీని దేవత లాగా పూజించడం వల్ల పంటలుబాగా పండుతాయని గ్రామస్థుల నమ్మకం.
గాంధీని ఇలా దేవతలాగా పూజించే సంప్రదాయం 1947లో మొదలయిందని చెబుతారు. ఈ వూర్లో భూములన్నీ ఒక భూస్వామి ఆదీనంలో ఉండేవి. వీటిని విడిపించుకునేందుకు వాడు గాంధేయ మార్గంలో సత్యాగ్రహం చేశారు.
సత్యాగ్రహం తర్వాత భూస్వామి ఈ భూములను రైతులకు అప్పచెప్పాడు. ఇది గాంధీజీ ప్రభావమే నని గ్రామస్థుల విశ్వాసం. దీనితో గాంధీసంబరాలు జరపుకోవడం మొదలయింది.
అంతకు ముందు కేదారిపురంలో పంటల సమృద్ధిగా పండాలని గ్రామదేవతని పూజించేవారు. ఈ భూ విముక్తి తర్వాత దేవత స్థానంలోకి దేవత రూపంలో మహాత్మగాంధీ వచ్చి చేశారు. కేదారిపురం శ్రీకాకులం జిల్లా కేంద్రానికి 110 కి.మీ దూరాన ఉంటుంది. ఆంధ్రా-ఒదిషా సరిహద్దున ఉన్న ఈ  గ్రామ జనాభా 1500. ఈ ఏడాది కూడా ఆగస్టు2 గాంధమ్మ సంబరాలు జరిగాయి. సాధారణంగా ఖరీఫ్ కు ముందు శ్రావణ మాసారంభంలో ఈ సంబరం నిర్వహిస్తారు. గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ ఈ వూరేగింపులోపాల్గొంటాయి. గ్రామపెద్దలేపులో ప్రారంభించినా ఈతరం వాళ్లు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
పండగ రోజున పిల్లా పెద్ద ఆడ మగ తేడాలేకుండా గ్రామస్థులంతా చిందులేస్తారు. తీపిపదార్ధాలను, పళ్లను తీుకుని వూరిగింపుగా వెళ్లి ఒక చోట గాంధీ బొమ్మకు నైవేద్యం సమర్పించి పూజ చేయడంతో సంబరం ముగుస్తుంది.

(ఫీచర్ ఫోటో Times of India నుంచి)