గాంధీజీ విజయవాడ ఎన్ని సార్లు వచ్చారో తెలుసా?

మహాత్మగాంధీ స్వాంతంత్య్ర పోరాటానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు విజయవాడ నగరాన్ని మొత్తం ఏడు సార్లు సందర్శించారు.
1919-1946 మధ్య ఆయన విజయవాడకు వచ్చి పలు సభలలో ప్రసంగించారు. ప్రజలను ఉత్తేజ పరిచారు.
ఆయన మొదటి పర్యటన 1919మార్చి 31న జరిగింది. అపుడు రామ్మోహన్ రాయ్ లైబ్రరీలో మహాత్మాగాంధీ సత్యాగ్రహం గురించి ఉపన్యసించారు.
రెండోసారి 1920,ఆగస్టు 23న విజయవాడ వచ్చారు. అపుడు మునిసిపల్ బంగళాలో బస చేశారు. సహాయనిరాకరణ ఉద్యమం గురించి ప్రజలకు తెలియచెప్పడం కోసం చేస్తున్న పర్యటనల్లో భాగంగా విజయవాడ వచ్చి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను, అవార్డులను, ఇతర గౌరవాలను వదిలేయాలని పిలుపునిచ్చారు.
తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల కోసం గాంధీ ఏప్రిల్ 21,1921న మూడో సారి విజయవాడ వచ్చారు. అపుడు ఆయన గొల్ల నారాయణరావు అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు.గాంధీజీ ప్రారంభించిన స్వరాజ్య నిధికి నారాయణరావు రు. 2500విలువయిన భార్య నగలతో పాటు రు. 25,000 విరాళం కూడా ఇచ్చారు.

https://trendingtelugunews.com/ap-kedaripuram-villagers-worship-gandhiji-as-goddess/

అప్పుడే జాతీక పతాకం నమూనాకు అంకురార్పణ జరిగింది.  విజయవాడ ప్రాంతానికి చెందిన జాతీయవాది పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ పతాకం నమూనాను గాంధీకి అందించారు.
ఇక నాలుగో సారి మహాత్మగాంధీ ఏప్రిల్ 10,1029న విజయవాడ వచ్చారు. అపుడు ఆయన ఖద్దరు ప్రచారంలో భాగంగా వచ్చారు. సమీపంలోని గుణదల,మొగల్రాజపురం ఖద్దరు సెంటర్లను సందర్శించారు.
అయిదో సారి ఆయన 1933,డిసెంబర్ 16న విజయవాడ వచ్చారు. హరిజన్ యాత్రలో భాగంగా విజయవాడ సందర్శించిన బాపూజీ అపుడు మొగల్రాజపురం లో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.
తర్వాత గుంటూరు జిల్లాలో తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు 1937, జనవరి 23న విజయవాడ సందర్శించారు.
ఆయన చివరి విజయవాడ పర్యటన 1946 జనవరి 21 న జరిగింది.ఒక ప్రత్యేక రైలులో ఆయన విజయవాడ వచ్చారు.హిందీ ప్రచార సభకోసం అపుడు ఆయన విజయవాడ కు వచ్చారు.
గాంధీజీకి విజయవాడతో ఉన్న అనుబంధానికి గుర్తుగానే పట్టణంలో ఉన్న ఒక కొండ పేరును గాంధీ హిల్ అని పేరు పెట్టారు.తర్వాత 1968లో కొండమీద గాంధీ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇదే గాంధీజీని ఏర్పాటుచేసిన తొలి స్మారక స్థూపం. 1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 52 అడుగుల ఎత్తున ఈ స్థాపాన్ని ఆవిష్కరించారు. అక్కడే గాంధీ మెమోరియల్ లైబ్రరీ,ప్లానెటేరియం వచ్చాయి. ఇది వేరే కథ.
ఈ పర్యటనల్లో ఆయన మచిలీపట్టణాన్ని రెండు సార్లు సందర్శించారు. అక్కడి నేషనల్ కాలేజీలో రెండురోజులున్నారు. అంతేకాదు, కాలేజీ విజిటర్స్ రిజిస్టర్ లో 1921, ఏప్రిల్ 3 తన సందర్శన గురించి నాలుగు ముక్కలు రాశారు.
ఈ కాలేజీ 1910 లో మొదలయింది.
‘నేనిక్కడ రెండు రోజులు ప్రశాంతంగా గడిపాను. ఇవి ఈ గొ ప్ప విద్యాలయపు పవిత్ర నేల మీద నేను గడిపిన ఈ రెండురోజులు నాజీవితంలో పవిత్రంగా మిగిలిపోయే రోజులు. భారతీయుడిగానేను ఈ కాలేజీకి గురించి గర్వపడుతున్నాను.
(“I have spent two quiet and what shall always remain with me sacred days on the sacred grounds on this great educational institution. As an Indian I feel proud of it.”)
గాంధీజీ మచిలీపట్టణాన్ని రెండో సారి 1933 డిసెంబర్ 12న సందర్శించారు.
(ఫీచర్ ఫోటో vijayawadatourism నుంచి)