కేటిఆర్ కు ఖమ్మం పోరగాళ్లు ఇట్లా షాక్ ఇచ్చిర్రు (వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ఇటీవల జనాల నుంచి షాక్ లు బాగానే తగులుతున్నాయి. తాజాగా బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటించారు. ఆయన పర్యటనలో మైనింగ్ కాలేజీ స్టూడెంట్స్ కేటిఆర్ ను ఘెరావ్ చేశారు. వారి తాకిడి తట్టుకోలేక వెంటనే కేటిఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తగూడెం సింగరేణి మైనింగ్ కాలేజీ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని కేటిఆర్ ను ఘెరావ్ చేశారు. కొత్తగూడెం సింగరేణి మైనింగ్ కాలేజీ 400 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణంలోనే 26 ఎకరాలను నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్నది. అయితే మంత్రి కేటిఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా తమకు మైనింగ్ కాలేజీలో సదుపాయాలు లేవని, వెంటనే సదుపాయాలు కల్పించాలని స్టూడెంట్స్ అడిగారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ప్రతిపాదన ఉంది. కాబట్టి మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ అడిగారు. కానీ కమిటీ వేసి సమస్య పరిష్కరిస్తామని కేటిఆర్ చెప్పే ప్రయత్నం చేస్తే విద్యార్థులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో కేటిఆర్ అక్కడి నుంచి నిష్క్రమించారు. విద్యార్థులు ఆందోళన వీడియో పైన ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *