‘గాలిలోమేడలు’: ‘ఏలియన్ స్పేస్ స్టేషన్’ కు ఫోరమ్ లో ఎదురు దెబ్బ

కొన్నేళ్ల కిందట హైదరాబాద్ న్యూస్ పేపర్లలో మొదటి రెండు మూడు పేజీలలో ఒక యాడ్ వచ్చేది.ఏలియన్ స్పేష్ స్టేషన్ పేరుతో ఆకాశహర్మ్యాలను కడుతున్నామని, మీరుగాలి లో విహరించండని ఈ కంపెనీ తెగ  ఆశ చూపింది.హైదారాబాద్ తేల్లాపూర్ లో 20 ఎకరాలలో 29 అంతస్థుల కాంప్లెక్స్ కడతామని ఈ కంపెనీ ప్రజలను వూరించింది.
ఈ ప్రకటనలు చూసి చాాాలా మంది గాల్లో మేడలు వూహించుకుని ఎంతో కష్టపడి కూడబెట్టు కున్న డబ్బునంతా కంపెనీకి ధారపోశారు. ఒక్కొక్కరు రు. 20 లక్షల నుంచి రు.50లక్షల అడ్వాన్సుగా  చెల్లించారు.  2010లో వీళ్లంతా ఏలియన్ స్పేషన్ స్టేషన్ లో ఫ్లాట్స బుక్ చేసుకున్నారు.
పదేళ్లయినా  గాలిలో మేడలు లేయలేదు.
వీళ్ల కలలు మేడలు కూలిపోయాయి. కంపెనీ చెప్పినట్లుగా గాలిలో మేడలు కట్టలేకపోయింది. దానికి తోడు డిపాజిట్ చేసిన వారికి డబ్బు వాపస్ ఇవ్వకుండా సతాయించడం మొదలుపెట్టింది.
ఉదాహరణకు  అమిత్ గుప్తా కేసుతీసుకోండి. ఆయన ఫ్లాట్ కోసం 50 శాతం డబ్బు కింద రు. 42 లక్షలు చెల్లించాడు. దాదాపు పదేళ్లయింది. ఫ్లాట్ నిర్మాణం కాలేదు.
అమిత గుప్తాలాంటి వాళ్లంతా ఫ్లాట్లు రాక, కంపెనీ డబ్బులు వాపసు ఇవ్వక కోర్టులలో కేసు వేసి తిరుగుతున్నారు.ఇలాంటి బాధితుల్లో ఒకరు వినియోగదారలు ఫోరంలో కేసు వేసి ఒపికగా తీర్పు వచ్చే దాకా వేచి విజయం సాధించారు.
ఈ కంపెనీ డబ్బులు వసూలు చేసుకుంది కాని, చెప్పినట్లు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వలేదని చెబుతూ ఈ వినియోగదారునికి  రు. 30 లక్షల రుపాయలు  12 శాతం వడ్డీతో చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం (Telangana State Consumer Disputes Redressal Forum) ఆదేశాలు జారీచేసింది.
ఫోరమ్ అధ్యక్షుడు జస్టిస్  ఎంఎస్ కె జైస్వాల్, సభ్యుడు రామనాథన్ ల బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బాలానగర్ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ మీద విచారణ జరిపి ఫోరమ్ ఈ తీర్పు వెల్లడించింది. సకాలంలో ఫ్లాట్ నిర్మించి ఇవ్వకపోవడమే కాకుండా, ఈ సంస్థ చట్టవ్యతిరేక పద్ధతులను అవలంభిస్తున్నదని ఆయన ఫోరమ్ లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్  ఏ రోజున కంపెనీకి ఫ్లాట్ కొనుగోలు కోసం డబ్బు చెల్లించాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా 12 శాతం వడ్డీ కడుతూ మొత్తం చెల్లించాలని ఫోరమ్ ఆదేశించింది. అంతేకాకుండా కోర్టు ఖర్చుల నిమిత్తం మరొక రు.5000 చెల్లించాలని కూడా బెంచ్ ఆదేశించింది.
సకాలంలో ఫ్లాట్ నిర్మించి ఇవ్వకపోవడం కంపెనీ తప్పయితే, ఫ్లాట్ల నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడకుండా ఎల్ బి నగర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం మంజూరుచేయడం కూడా తప్పేనని ఫిర్యాదు తరఫు న్యాయవాది  విఅప్పారావ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *